Share News

ఏబీఎన్‌ సంస్థలపై వైసీపీ దాడులు.. ఖండించిన నేతలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:28 AM

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ దాడులను హోంమంత్రి అనిత, ఎంపీలు కేశినేని శివనాథ్, కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. డైవర్షన్ కోసమే ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులకు పాల్పడిందని నేతలు ఆరోపించారు.

ఏబీఎన్‌ సంస్థలపై వైసీపీ దాడులు.. ఖండించిన  నేతలు
Home Minister Anitha

అమరావతి, ఏప్రిల్ 7: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై(ABN-Andhrajyothy) వైసీపీ దాడులను హోం మంత్రి వంగలపూడి అనితతో(Home Minister Vangalapudi Anitha) పాటు పలువురు నేతలు ఖండించారు. మంగళవారం ఏబీఎన్‌తో హోంమంత్రి మాట్లాడుతూ.. డైవర్షన్ కోసమే ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. నేరప్రవృత్తి కలిగినవారే దాడులకు పాల్పడతారని వ్యాఖ్యలు చేశారు. మావిగన్‌ను పిల్లలు కూడా అంగీకరించడం లేదని తెలిపారు. జగన్ వ్యాఖ్యలను గుడ్డిగా నమ్మడం సరికాదన్నారు. ఇబ్బంది ఉంటే లీగల్‌గా వెళ్లాలని.. దాడులు సరికాదని హోంమంత్రి అనిత తెలిపారు.


జగన్ తీరుపై ఎంపీ ఫైర్

ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు పిరికిపంద చర్యలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. వేమూరి రాధాకృష్ణ వాస్తవాలే చెప్పారని తెలిపారు. తప్పులు సరి చేసుకోకుండా అల్లరి చేయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు అమరావతికి అనుకూలమని జగన్ చెప్పలేదా అని గుర్తుచేశారు. ఆ తరువాత మాట మార్చి మూడు రాజధానులని మూడు ముక్కలాడింది జగన్ కాదా అంటూ నిలదీశారు. ఇప్పుడు మావిగన్ పేరుతో కామెడీ పీస్‌గా మారిందీ జగన్‌నే అని అన్నారు. ఇన్ని డ్రామాలు ఆడినా జగన్‌ను గుడ్డిగా అనుకరించేవారిని ఏమనాలని మండిపడ్డారు. జగన్ తానా అంటే తందానా అనే వారే ఆయన చుట్టూ ఉన్నారని అన్నారు.


‘పుట్టి పెరిగిన భూమి, ఊరుపై మమకారం లేదా. జగన్ ఏం చెబితే దాన్ని గుడ్డిగా సమర్ధించడమేనా. పైకి వారు మాట్లాడుతున్నా... జగన్ తీరు చూసి వారే నవ్వుకుంటున్నారు. మొన్న కొంతమంది ఎంపీలు కూడా మా వద్దకు వచ్చి తమ గోడు చెప్పుకున్నారు. జగన్‌ను గుడ్డిగా అనుకరించే వారిని చూస్తే ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు సీన్లు గుర్తు వస్తున్నాయి’ అంటూ ఎంపీ అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని హితవుపలికారు. మీ తప్పులు ఇవి అని చెబితే దాడులు చేస్తారా అంటూ నిలదీశారు. చట్టం చూస్తూ ఊరుకోదని.. జైలుకు పంపిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.


కక్షసాధింపు చర్యే: ఎంపీ అప్పలనాయుడు

ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ డైరెక్షన్‌లోనే వైసీపీ మూకలు దాడులు చేశాయని ఆరోపించారు. వందశాతం ఇది కక్షసాధింపు చర్యే అని ఎంపీ అన్నారు.


జగన్ ఆదేశాలతోనే దాడులు: రవి నాయుడు

ఏబీఎన్ ప్రసారం చేసిన విషయంలో తప్పేముందని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రశ్నించారు. ఏబీఎన్ వాస్తవాలు చెప్తే దుష్ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ జీవిత చరిత్ర అందరికీ తెలుసన్నారు. వైసీపీ పార్టీ కరపత్రిక సాక్షి ప్రచారాలపై రోజూ దాడి చేయాలి కదా అని ప్రశ్నించారు. సాక్షిలో రోజూ విష ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రోత రాతలు రాస్తున్న సాక్షిని ఏం చేయాలో వైసీపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ ఆదేశాలతోనే ఏబీఎన్‌పై దుష్ప్రచారం, దాడులు చేశారని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రుల సమ్మె విరమణ

జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 11:51 AM