ఇలాంటి సైకోలకు సంకెళ్లు, సెంట్రల్ జైళ్లే సరైన ట్రీట్మెంట్: ఏపీ మంత్రులు
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:21 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులను మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా 4వ స్తంభం అన్న ఇంగిత జ్ఞానం కూడా జగన్‌కు లేదు... రాదు అని విమర్శించారు.
అమరావతి, ఏప్రిల్ 7: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై(ABN - Andhrajyothy) వైసీపీ నేతల దాడులపై మంత్రులు కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathi), ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) స్పందించారు. జగన్‌పై మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏబీఎన్‌పై వైసీపీ మూకల దాడులు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులకు నిదర్శనమన్నారు. జగన్‌కు, తన వైసీపీ గూండా గ్యాంగ్‌కు ప్రజాస్వామ్యం అంటే చులకన భావమంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ నియంత అని.. తన మాటే అందరూ వినాలనే స్వభావం ఆయనదన్నారు. జగన్‌కు తన భజన చేసే మీడియా తప్ప... మిగిలిన మీడియా అంటే విద్వేషభావమని అన్నారు. జగన్, తన పార్టీ నేతలు చేసే దుర్మార్గాలను, కుట్రలను బట్టబయలు చేసే మీడియాపై జగన్ దాడులు చేయించారని మంత్రి ఆరోపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా 4వ స్తంభం అన్న ఇంగిత జ్ఞానం కూడా జగన్‌కు లేదు... రాదు అని మంత్రి విమర్శించారు. ప్రజాస్వామ్యంపై దాడులకు పాల్పడే సైకోలకు సంకెళ్లు, సెంట్రల్ జైళ్లే సరైన ట్రీట్మెంట్ అని తెలిపారు. ప్రజాస్వామ్యానికి మనం ఏమి ఇస్తామో.. అది కూడా అలాగే తిరిగి ఇస్తుందన్నారు. 151 నుంచి 11 సీట్లకు పడిపోయినా జగన్ అండ్ కో కు సిగ్గూ, శరం లేకుండా మీడియాపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏబీఎన్‌పై వైసీపీ మూకల దాడులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. జగన్ తెచ్చిన మావిగన్ చేతిలోనే ఆయన రాజకీయ భవిష్యత్తు బలికావడం ఖాయమని మంత్రి పార్థసారథి వ్యాఖ్యలు చేశారు.
సిగ్గు మాలిన చర్య: మంత్రి ఆనం రామనారాయణ
ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా మీడియా సంస్థలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించడం దారుణమని మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును అణచివేయడం వైసీపీ సంస్కృతి అని తీవ్ర విమర్శలు చేశారు. ఆందోళన ముసుగులో దాడులు చేసి భయపెట్టాలని చూడడం ప్రజాస్వామ్యానికి ముప్పని వ్యాఖ్యానించారు. అమరావతి అంశంపై ప్రజలకు నిజాలు చెబుతున్న మీడియాను టార్గెట్ చేయడం దారుణమన్నారు. జగన్ వ్యాఖ్యలను ప్రశ్నించినందుకే ఏబీఎన్‌పై దాడులు జరగడం విచారకరమన్నారు.
‘మావిగన్’ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ఖండిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ రాజకీయ లాభాల కోసం హింసను ప్రోత్సహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. రౌడీ మూకలను వెంటేసుకొని స్వయంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీడియా సంస్థపై దాడికి పాల్పడడం వారి కుసంస్కారానికి నిదర్శనమని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూసి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలు సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను అంగీకరించలేని పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్
ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులు.. ఖండించిన నేతలు
Read Latest AP News And Telugu News