Share News

ఏబీఎన్ ఆఫీస్‌ ముందు వైసీపీ ఆందోళన

ABN , Publish Date - Apr 07 , 2026 | 10:13 AM

హైదరాబాద్‌లోని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ హంగామా సృష్టించింది.

ఏబీఎన్ ఆఫీస్‌ ముందు వైసీపీ ఆందోళన
ABN Andhrajyothy

హైదరాబాద్, ఏప్రిల్ 7: ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేసింది. ఈరోజు(మంగళవారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిపై వైసీపీ నాయకులు అసభ్య దూషణలు చేశారు. ఆందోళన ముసుగులో దాడులు చేసి మీడియా సంస్థలను భయపెట్టాలని వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘మావిగన్’ ఊబి నుంచి బయటపడేందుకు వైసీపీ ఈ కుయుక్తులకు పాల్పడుతోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.


అమరావతి చట్టబద్ధతను అవమానిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది. మావిగన్ పేరుతో అమరావతిపై విషంకక్కే ప్రయత్నాన్ని ప్రజల ముందు ఉంచింది ఏబీఎన్. మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులకు వైసీపీ మూకలు యత్నించాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ రౌడీమూకలు రెచ్చిపోయాయి. ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు.


ఇవి కూడా చదవండి...

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రుల సమ్మె విరమణ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 10:38 AM