రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్ పరిమితం: హరీశ్ రావు
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:17 PM
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెలే, మాజీ మంత్రి హరీశ్ రావు మళ్లీ నిప్పులు చెరిగారు. మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ నువ్వు మళ్ళీ గెలవడం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా నీ పార్టీకి రాదని జోస్యం చెప్పారు.
హైదరాబాద్, ఏప్రిల్ 07: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెలే, మాజీ మంత్రి హరీశ్ రావు మళ్లీ నిప్పులు చెరిగారు. మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ నువ్వు మళ్ళీ గెలవడం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా నీ పార్టీకి రాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే తమను అరెస్టు చేశారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన.. బేడీల పాలన.. గుడ్డి పాలన అంటూ హరీశ్ రావు అభివర్ణించారు. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టండంటూ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నా భూములను ఎందుకు లాక్కుంటున్నారంటూ ప్రభుత్వాన్ని సూటిగా ఆయన ప్రశ్నించారు. మీ పాలన అంతా బోగస్ మాటలు.. బోగస్ పాలన అంటూ రేవంత్ పరిపాలనను ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా? అని ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రశ్నించారు.
పరిగిలో భూముల లాక్కొని తన సోదరుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.. 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామరాజ్యం వస్తుంది.. కేసీఆర్ రాజ్యం వస్తుందని ఈ సందర్భంగా హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. పరిగిలో రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తన్న హరీశ్ రావుతో ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో హరీశ్ రావు పైవిధంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి..
మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు
అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: డీజీపీ శివధర్ రెడ్డి
Read Latest TG News And Telugu News