సీఎం భార్యపై పాస్‌పోర్ట్ ఆరోపణలు.. పవన్ ఖేడా ఇంటికి పోలీసులు
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:45 PM
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ పోలీసు కేసు పెట్టడంతో అస్సాం పోలీసుల బృందం కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా నివాసానికి మంగళవారంనాడు వెళ్లారు. రిణికి భూయాన్‌కు మూడు దేశాల పాస్‌పోర్టులు, విదేశాలతో ఆస్తులు ఉన్నాయని, వాటిని అఫిడవిట్‌లో సీఎం వెల్లడించకుండా దాటిపెట్టారని పవన్ ఖేడా ఇటీవల ఆరోపించారు.
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ (Riniki Bhuyan) పోలీసు కేసు పెట్టడంతో అస్సాం పోలీసుల బృందం కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా (Pawan Khera) నివాసానికి మంగళవారంనాడు వెళ్లారు. రిణికి భూయాన్‌కు మూడు దేశాల పాస్‌పోర్టులు, విదేశాలతో ఆస్తులు ఉన్నాయని, వాటిని అఫిడవిట్‌లో సీఎం వెల్లడించకుండా దాటిపెట్టారని పవన్ ఖేడా ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని రిణికి భూయాన్ ఖండించారు. ఆయనపై పోలీసు కేసు పెట్టారు. దీంతో అస్సాం పోలీస్ టీమ్ పవన్ ఖేడాను ప్రశ్నించేందుకు నిజాముద్దీన్ ఏరియా పోలీసులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. పవన్ ఖేడా అక్కడ లేకపోవడంతో ఆయన కోసం వేచిచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో లేరని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
వివాదం ఏమిటి?
యూఏఈ, ఆండిగ్వా బార్బుడా, ఈజిప్ట్ నుంచి హిమంత బిశ్వ శర్మ భార్య పేరుతో మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ఇటీవల జరిపిన మీడియా సమావేశంలో పవన్ ఖేడా ఆరోపించారు. జీవితమంతా ముస్లింలపై విద్వేషంతోనే హిమంత గడిపారని, కానీ ఆయన భార్య రెండు ముస్లిం దేశాల నుంచి పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత దేశం నుంచి పారిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. హిమంత భార్యకు దుబాయి, యూఎస్ రాష్ట్రం వయోమింగ్‌లో సొంతంగా రెండు ఆస్తులు ఉన్నాయని కూడా ఆరోపించారు.
పవన్ ఖేడా ఆరోపణలు హిమంత బిశ్వా శర్మ తోసిపుచ్చారు. ప్రజలు తమకు మరోసారి చారిత్రక తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో పవన్ ఖేడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, సత్యం బయటపడి ఆయన తప్పుడు ప్రచారానికి ప్రచారానికి తెరపడుతుందని, ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చని అన్నారు. రిణికి భూయాన్ సైతం తనపై పవన్ ఖేడా చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. భారత్ ఎటువంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని, తనకు మూడు పాస్‌పోర్టులు ఉండటం అబద్ధమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేసీఆర్‌ను మార్చినట్లే.. పినరయి విజయన్‌ను మార్చేస్తారు: రేవంత్‌రెడ్డి