భూహక్కు చట్టం, జీవో 512 కాపీల దహనం
ABN, Publish Date - Dec 23 , 2023 | 01:57 AM
భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని, జీవో నెం.512ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తు న్న నిరసనల్లో భాగంగా శుక్రవారం ఆ చట్టం, జీవో కాపీ లను దహనం చేశారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని, జీవో నెం.512ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తు న్న నిరసనల్లో భాగంగా శుక్రవారం ఆ చట్టం, జీవో కాపీ లను దహనం చేశారు. ప్రజా వ్యతిరేక చీకటి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడు తూ నకిలీ రికార్డులను తయారు చేయించుకొని భూము లను ఆక్రమించుకునే కబ్జాదారులకు చట్టం చుట్టంగా ఉపయోగపడుతుందని విమర్శించారు. భూ వివాదాల సత్వర పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పా టుచేయాలని సూచించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఏపీ భూహక్కుల చట్టం ద్వారా సత్వర న్యాయం అందిస్తా మనడం అవివేకమన్నారు. ఇప్పటికే భూలావాదేవీల విషయంలో రెవెన్యూ అధికారులు చేస్తున్న చట్ట వ్యతి రేక చర్యల వల్ల న్యాయస్థానాల్లో భూ వివాదాల కేసు లు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. అలాంటి అధి కారుల చేతుల్లో ఆస్తులపై హక్కులు, వారసుల నిర్ధా రణ వంటి హక్కులను పెట్టడం ద్వారా న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్లే వెసులుబాటును ప్రజలకు లేకుండా చేయడమే కాకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును హరించడమేనని ఆరోపించారు. ఈ కార్యక్ర మంలో న్యాయవాదులు ఎంవీ ప్రసాద్, రామారావు చౌదరి, సూరపురెడ్డి తాతారావు, జి.దేవీభవానీ, దాసరి అమ్ములు, కె.సునీల్ లయనల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 01:57 AM