ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఖేల్‌రత్న అవార్డు గ్రహీతకు అభినందనలు

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:33 AM

ఖేల్‌రత్న అవార్డు గ్రహీతకు అభినందనలు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 21: అంతర్జాతీయ బ్యా డ్మింటన్‌ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్‌కు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును ప్రకటించడం పట్ల కోనసీమ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి దుడ్డువారి అగ్రహారం ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో అభి నందన సభ నిర్వహించారు. బ్యాడ్మింటన్‌ క్రీడతో కోనసీమకే కాకుండా దేశానికే కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్న సాత్విక్‌ను అభినందనలతో ముంచెత్తారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మెట్ల రమణబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయి తాబత్తుల ఆనందరావు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై సాత్విక్‌ క్రీడా ప్రతిభను కొనియాడారు. రమణబాబు కేక్‌ కట్‌ చేసి సాత్విక్‌ తల్లిదండ్రులైన కాశీ విశ్వ నాథం-రంగమణి దంపతులకు తినిపించారు. డీఎస్పీ ఆధ్వ ర్యంలో వారిని సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ బి.రాఘ వేంద్రరావు, డాక్టర్‌ సీహెచ్‌ విష్ణుమూర్తి, డాక్టర్‌ పప్పు శర్మ, డాక్టర్‌ గోకరకొండ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

Updated Date - Dec 22 , 2023 | 12:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising