ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కవచంలా నిలిచే వినియోగదారుల రక్షణ చట్టం : జేసీ నుపూర్‌ అజయ్‌

ABN, Publish Date - Dec 24 , 2023 | 01:26 AM

వినియో గదారుడు కొనుగోలుచేసే వస్తు సేవలకు సంబంధించి వినియోగదారుల రక్షణ చట్టం కవచంలా పనిచేస్తుందని జేసీ నుపూర్‌అజయ్‌ పేర్కొన్నారు.

అమలాపురం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): వినియో గదారుడు కొనుగోలుచేసే వస్తు సేవలకు సంబంధించి వినియోగదారుల రక్షణ చట్టం కవచంలా పనిచేస్తుందని జేసీ నుపూర్‌అజయ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో శనివారం జాతీయ విని యోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ నుపూర్‌ అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరై వినియో గదారుల హక్కులు-బాధ్యతలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు. తొలుత డ్రగ్‌ కంట్రోలర్‌, ఆహార భద్రతశాఖ, లీగల్‌ మెట్రాలజీశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ ను ఆమె పరిశీలించారు. డిజిటల్‌ లావాదేవీలు, మందు లు కొనుగోలు వంటి వాటిపై ముందస్తుగా తీసుకోవల సిన జాగ్రత్తలను వివరించారు. నాసిరకం ఉత్పత్తులు, నకిలీ ప్రకటనలు, తప్పుడు ఆఫర్లు వంటి వాటి నుంచి వినియోగదారుల రక్షణ చట్టం కాపాడుతుందన్నారు. ఎలక్ర్టానిక్‌ ఫోరమ్స్‌లో కొనుగోలుచేసిన వస్తువులను కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చారన్నారు. చట్టం అమలుకు సంబంధించి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో వినియోగదారుల కమిషన్లు ఏర్పాటు అయ్యాయన్నారు. చట్టపరిధిలో ఫిర్యాదుచేయాలంటే రూ.5 లక్షల వరకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తరువాత నామమాత్రపు కోర్టు ఫీజుతో ఫిర్యాదులు చేయవచ్చన్నారు. నాణ్యతా లోపాలు ఉంటే టోల్‌ఫ్రీ నం బరుకు కాల్‌ చేయవచ్చన్నారు. విద్యార్థులు జాగో.. భార త్‌ జాగో వంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారుల హక్కుల గురించి అవగాహన పెంపొందిస్తున్నామన్నారు. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కిరణ్‌ మాట్లా డుతూ కొనుగోలుచేసిన వస్తువులు నాణ్యత లేనప్పుడు కమిషన్‌కు ఫిర్యాదుచేయాలన్నారు. అనంతరం జిల్లా స్థా యిలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహిం చిన క్విజ్‌, వ్యాసరచన పోటీల్లో విజేతలకు జేసీ నగదు బహుమతులు అందజేశారు. జిల్లా పౌర సరఫరాల అధి కారి ఎ.పాపారావు, తూనికలు, కొలతలశాఖ అధికారి రా జేష్‌, ఫోరం సభ్యుడు మాలే శ్రీనివాసనగేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 01:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising