ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి’

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:44 AM

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 23: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని చూసి రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి దంపతులు కోరారు. శనివారం మనమందరం

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 23: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని చూసి రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి దంపతులు కోరారు. శనివారం మనమందరం కలవాలి- చంద్రన్నకు అండగా నిలవాలి-తటస్థులతో మీ అనంతలక్ష్మి కార్యక్రమాన్ని రమణయ్యపేటలో నిర్వహించారు. తటస్థుల ఇళ్ల కెళ్లి చంద్రబాబుకే ప్రజలు ఎందుకు ఓట్లేయాలి, వైసీపీకి ఎందుకు ఓట్లేయరాదో వివరించారు. వైసీపీ పాలన రాజకీయ కక్షతో, అక్రమ అరెస్ట్‌ల తో ప్రజా వ్యతిరేఖ విఽధానాలతో సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా టీడీపీ-జనసేన చారిత్రకంగా పొత్తు పెట్టుకున్నారని, తటస్థులంతా విజ్ఞతతో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేసేందుకు వచ్చి ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. మాజీ ఎంపీపీ జి.శ్రీనివాసరావు, పార్టీ నాయకురాలు పలివెల గాయత్రి, కాళ్ల శ్రీను, పెంకే వీరబాబు, అత్చుత్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:44 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising