ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్టాంపులు కనుమరుగు!

ABN, First Publish Date - 2023-11-26T00:00:56+05:30

పొలం కొన్నారా..ఏదీ దస్తావేజు.. ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉండే జుడీషి యల్‌ స్టాంప్‌ పేపర్‌పై నల్లటి అక్షరాలు కనిపిస్తే ఆ ఆనందమే వేరు.. అటువంటి ఆనందాన్ని ప్రభుత్వం దూరం చేస్తుంది..

జుడీషియల్‌ స్టాంపులు నిలిపివేత

బ్లాక్‌లో పాత స్టాంపులు

రూ.100 స్టాంప్‌ రూ. 500

ఈ-స్టాంప్‌కూ అదనం

జుడీషియల్‌ స్టాంపులకే డిమాండ్‌

కొనుగోళ్లకు ఎగబాటు

ప్రభుత్వ నిర్ణయంపై అసహనం

పొలం కొన్నారా..ఏదీ దస్తావేజు.. ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉండే జుడీషి యల్‌ స్టాంప్‌ పేపర్‌పై నల్లటి అక్షరాలు కనిపిస్తే ఆ ఆనందమే వేరు.. అటువంటి ఆనందాన్ని ప్రభుత్వం దూరం చేస్తుంది.. నాన్‌ జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు కనుమరుగు కానున్నాయి..ఈ స్టాంప్‌ పేపర్లతో ప్రస్తుతం రిజిస్ర్టేషన్లు సాగుతున్నాయి. అయితే కొనుగోలుదారులు మాత్రం నాన్‌-జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు మాత్రమే కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.. బ్లాక్‌లో కొనుగోలు చేసి మరీ రిజిస్ర్టేషన్లు చేయిం చుకుంటున్నారు. ప్రభుత్వం నాన్‌- జుడీషియల్‌ స్టాంపులను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సీతానగరం, నవంబరు 25 : ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌.. కాగితం లేకుండా పనిజరిగిపోవాలి..పూర్వం ప్రతీ పనికి కాగితం ఉండా ల్సిందే.. పూర్వం నుంచి నేటి వరకూ బీరువా తెరి స్తే చాలు పచ్చ,ఎరుపు రంగులో ఉండే 20,50, 100ల స్టాంప్‌ పేపర్లు బయటపడతాయి.అప్పు ఇస్తే నోటు.. రిజిస్ర్టేషన్‌ అయినా వీలునామా అయినా స్టాంప్‌ పేపర్‌.. ఆ పేపర్‌పై సంతకం పడిందంటే పనైపోయినట్టే.. పెద్దలు ఇదీ నాటి నమ్మకం..ఆ నమ్మకానికి కాలం చెల్లుతోంది.. ఎందుకంటే నాన్‌ జుడీషియల్‌ స్టాంపులు ఇక కనుమరుగు కానున్నాయి.ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లకు, అంగీకారపత్రాలు,ప్రైవేటు తనఖాలు, సెటిల్‌మెంట్లు రాసుకోవడానికి ఎక్కువగా నాన్‌ జుడీషియల్‌ స్టాంపులు వాడుతుంటారు. ఇవి పూర్వం నుంచి మన జీవితాల్లో భాగమైపోయాయి.ఏ పని జరిగినా జ్యుడీషియల్‌ స్టాంపులు తప్పనిసరిగా వాడేవారు.

మార్కెట్లోకి ఈ-స్టాంపులు..

ప్రస్తుత ప్రభుత్వం నాన్‌ జుడీషియల్‌ స్టాంపుల స్థానంలో నాన్‌ జుడీషియల్‌ ఈ స్టాంపులు ప్రవేశపెట్టింది. ఇవి ప్రభుత్వం అనుమతిచ్చిన సెంటర్లలో కంప్యూటర్‌లో ప్రింట్‌ తీసి ఇస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన పేపర్‌ ఇస్తున్నారు. 10,20,50,100 ఇలా అన్ని రకాల్లో ఈ స్టాంపులు ఉన్నాయి. కానీ ఈ స్టాంపులు ప్రజలను ఆకట్టుకోవడం లేదు. ఎక్కడో దూరప్రాంతంలో నాన్‌ జుడీషియల్‌ స్టాంపులు దొరుకుతున్నాయని తెలిస్తే అక్కడకు వెళ్లి మరీ తెచ్చుకుంటున్నారు. ఈ స్టాంపులు కూడా పనిచేస్తాయని తెలుసున్నవారు చెబుతున్నా ప్రజలకు ఎక్కడం లేదు.

స్టాంపుల బ్లాక్‌ మార్కెట్‌

జుడీషియల్‌ స్టాంపు పేపర్లు రిజిస్ర్టేషన్‌ కార్యా లయాలు, స్టాంప్‌ వెండర్లు మాత్రమే విక్రయిం చేవారు..ఈ స్టాంపు కావాలంటే దరఖాస్తు చేయాల్సిందే. ఎందుకంటే ఆ స్టాంపుకు అంతటి ప్రాధాన్యత. అయితే ప్రస్తుతం ఆ స్టాంపులకు డిమాండ్‌ పెరిగింది. పాత పద్ధతిలో స్టాంపులు ప్రింట్‌ కావడంలేదు. దీంతో తప్పనిసరిగా ఈ స్టాంపులు తీసుకోవాల్సిందే. నాన్‌ జుడీషియల్‌ స్టాంపులపై ప్రజలు మక్కువ చూపుతుండడంతో స్టాంపు వెండర్లు ఆ స్టాంపులను బ్లాక్‌ చేసి రూ 100ల స్టాంపు రూ.300 నుంచి రూ.500ల వరకు విక్రయిస్తున్నారు. అయినా వినియోగదారులు అలాగే తీసుకుంటున్నారు. ఇంక మేమేమీ తక్కువ తినలేదంటూ ఈ స్టాంపులకు కూడా అదనంగా రూ.30లు వసూలు చేస్తున్నారు.స్టాంపు వెండర్స్‌పై సరైన అజమాయి షీలేకపోవడంతో ఇస్ట్టానుసారం అమ్ముతున్నారు. సం బంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-11-26T00:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising