జనసేన-టీడీపీ హామీలను వివరించాలి
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:42 PM
రాబోయే ఎన్నికల్లో ప్రజలకు అందించే జనసేన-టీడీపీ పథకాలను ప్రజలకు వివరించాలని జనసేన నాయకుడు దొడ్డిగర్ల సువర్ణరాజు అన్నారు.
నల్లజర్ల, డిసెంబరు 18: రాబోయే ఎన్నికల్లో ప్రజలకు అందించే జనసేన-టీడీపీ పథకాలను ప్రజలకు వివరించాలని జనసేన నాయకుడు దొడ్డిగర్ల సువర్ణరాజు అన్నారు. నల్లజర్లలోని పార్టీ నాయకుడు ఉన్నమట్ల సత్య ఇంటి వద్ద సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24న గోపాలపురంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని, జనసేన నాయకులు, కార్యకర్తలు విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. జనసేన-టీడీపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలను వివరించారు. అందరం కలిసి అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని గద్దే దించాలన్నారు. కార్యక్రమంలో రుద్ర శ్రీను, కవులూరు సత్తిబాబు, సెంధిల్ కుమారి, తలారి సౌజన్య,గుడిసు శివకృష్ణ, పెనుమాక కిషోర్, ఉన్నమట్ల రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:43 PM