ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటి కలత!

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:59 AM

45 వేల మంది పేదల సొంతింటి కలతీరుస్తాం.. ఇదీ చాలా కాలం కిందట నాయకులు ఇచ్చిన మాట.. మరి 45 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారా..?? ఏమో తెలియదనే సమాధానం లబ్ధిదారుల నుంచి వస్తోంది..

పునాది పాలైన లక్షలు : పునాదుల్లో పెరుగుతున్న పిచ్చి మొక్కలు

జగనన్న కాలనీ స్థలాలపై విముఖత

రాజమహేంద్రవరంలో 45 వేల మంది

కొందరికి స్థలాలివ్వకుండానే పట్టాలు

ఆవ పట్టాల ఊసేలేదు

వెలుగుబందలో 13 వేల పట్టాలు

800 మంది మాత్రమే నిర్మాణం

చాలా చోట్ల పునాది దాటని పనులు

అధికారులకు టార్గెట్లు

లబ్ధిదారులకు బెదిరింపులు

నిర్మాణంపై లబ్ధిదారుల అనాసక్తి

45 వేల మంది పేదల సొంతింటి కలతీరుస్తాం.. ఇదీ చాలా కాలం కిందట నాయకులు ఇచ్చిన మాట.. మరి 45 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారా..?? ఏమో తెలియదనే సమాధానం లబ్ధిదారుల నుంచి వస్తోంది.. నగరంలోని 36 వేల మందికి కోరుకొండ ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆ భూములు దేనికీ పనికిరావన్నది జగమెరిగిన సత్యం.. అయినా లబ్ధిదారులకు అంటగట్టేశారు. రాజమహేంద్రవరానికి ఎక్కడో 12 కిలోమీటర్ల దూరంలో వెలుగుబందలో మరో 13 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు.. సుమారు 45 వేల మంది ఇళ్ల స్థలాలిస్తే 800 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలోనూ ఇదే దుస్థితి.. సుమారు 1100 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటి వరకూ 400 మంది మాత్రమే పునాది వేశారు. ఇలా పేదల గూడు.. గోడు తప్ప.. ఏం కనిపించడం లేదు.. తమ టార్గెట్ల కోసం అధికారులు ఇళ్ల నిర్మాణం ఆరంభిం చాలని హడావుడి చేశారే తప్ప.. కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు.. దీంతో లబ్ధిదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగనన్న కాలనీలు కష్టాలకు కేరాఫ్‌గా మారాయి..

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ పరిధిలోని పేదల సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనుచూపుమేరలో కని పించడంలేదు. సుమారు 45 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి.. ఇళ్లు కట్టిస్తామని చెబుతూ ఏకంగా జగన్న కాలనీలే నిర్మిస్తున్నామని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఆచరణలో చూస్తే మాత్రం అం త గొప్పగా ఏం లేదు. సుమారు 36 వేల మంది లబ్ధిదా రులకు ఆవ భూముల్లో పట్టాలు పంపిణీ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.ఆవ భూమి నివాస యోగ్యం కాని ప్రాంతమని వివాదాలు రేగడంతో పాటు, ఇక్కడ తక్కువ ధర ఉన్న భూములను ఎక్కువ ధరకు కొని అవినీతికి పాల్పడ్డారనే వాదన రావడంతో కొంత కాలం అది కోర్టులో నిలిచిన సంగతి తెలిసిందే. తర్వాత కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఈ స్థలాల గురించి అధికారులుగానీ, వైసీపీ ప్రభు త్వం గానీ నోరు మెదపడంలేదు. ఇక రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో రాజమహేంద్రవరానికి చెందిన సుమారు 13 వేల మందికి పట్టాలిచ్చారు. కానీ అం దులో సుమారు 3 వేల వరకూ కోర్టు వివాదాలవల్ల ఆగిపోగా సుమారు 11 వేల ఇళ్లను మొదలు పెట్టడానికి భూమి పూజ చేశారు. ఇక కొద్ది నెలల్లో ఎన్నికలు రాబో తున్నాయి.కానీ ఇప్పటికి కూడా ఇళ్లు పూర్తి కాలేదు. సుమారు 800 ఇళ్లు పూర్తయినట్టు అధికారులు చెబు తున్నా నివాసం ఉండేది మాత్రం 50 కుటుంబాలే. ఈ జగనన్న కాలనీలో చాలా ఇళ్లు పునాది దశ దాటలేదు. 72 ఇళ్లను అసలు మొదలు పెట్టలేదు.తాము కట్టుకోలే మని.. ప్రభుత్వమే కట్టివ్వాలని లబ్ధిదారులు కోరుతు న్నారు. 5,277 ఇళ్లు పునాదుల్లోనే ఉన్నాయి. అధికారులు నేతల ఒత్తిళ్లు, పట్టా రద్దు చేస్తామనే బెదిరింపుల వల్ల కొందరు పునాదుల వరకు నిర్మించి ఆర్థిక స్తోమత లేక వదిలేశారు. మరో 3,364 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌లో ఉన్నాయి. వచ్చే జనవరి 31 నాటికి కనీసం మరో 2500 ఇళ్లు పూర్తి చేయాలని అధికార్లకు టార్గెట్‌ పెట్టారు. ఎన్నికల ముందు కనీసం ఈ ఇళ్లనైనా లబ్ధిదా ర్లకు అప్పగించి.. ఫిబ్రవరిలో గృహ ప్రవేశాలు చేయిం చి ఎన్నికలలో ప్రచారం చేసుకోవచ్చనే ఆలోచనతో ప్రభు త్వం ఉంది. కానీ వాస్తవ పరిస్థితి అనుకూలంగా లేదు. అవి కూడా పూర్తయ్యే పరిస్థితి తక్కువే. అంటే ఐదేళ్లు పూర్తవుతున్నా రాజమహేంద్రవరం పరిధిలో నిరుపేద లకు సొంతింటి కల నెరవేరే పరిస్థితి కని పించడం లేదు. సుమారు 45 వేల మందికి ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఇప్పటికి కేవలం 800 మందితో మాత్ర మే పూర్తి చేయించారు. మరో 2500 లక్ష్యంగా పెట్టుకు న్నారంటే ఎంత మందికి ఇళ్లిస్తారో అందరికీ అర్ధం అవు తోంది. వేలాది మంది లబ్దిదారులు తమ సొంతింటి కల నెర వేరుతుందా అని ఆందోళన చెందుతున్నారు.

ఇళ్లెలా కట్టాలి..

దేవరపల్లి, డిసెంబరు 17 : జగనన్న కాలనీలు అంటూ అట్టహాసంగా ప్రారంభించినప్పటికి క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులు సమస్యలతో సతమతం అవుతున్నారు. దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామంలో జగనన్న ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. లబ్ధిదారులు అష్టకష్టాల మీద బేస్‌మెంట్‌ వరకు నిర్మాణాలు చేశారు. కాలనీలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడు తున్నారు. బేస్‌మెంట్‌ నిర్మాణానికి పొలాల్లో ఎక్కడో దూరంగా ఉన్న బోరు దగ్గరకు వెళ్లి నీరు కావిళ్లు.. బిందెలతోనూ తెచ్చుకుని నిర్మాణం చేప ట్టారు. ఆ కాలనీ పైనుంచే విద్యుత్‌ లైన్‌ వెళ్లినా నేటికీ విద్యుత్‌ సౌకర్యం, మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి నిర్మాణాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. కాలనీ పైనుంచి విద్యుత్‌ లైన్‌ వెళ్లడంతో కొన్ని స్థలాలు లబ్ధిదారులకు అను కూలంగా లేవు. ఒక విద్యుత్‌ స్తంభం వేసి లైన్‌ పక్కకు జరిపితే ఇళ్లు నిర్మించుకుంటామని కలెక్టర్‌ కార్యాల యంలో స్పందన కార్యక్రమంలో రెండు సార్లు విద్యుత్‌ స్తంభాలు తొలగించాలని చెప్పినప్పటికి కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ స్థలాలు మాకొద్దు..

తాళ్ళపూడి, డిసెంబరు 17 : జగనన్న ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న లే అవుట్లు, జగనన్న కాలనీలు ప్రభుత్వ ప్రచారానికే తప్ప వాస్తవానికి దూరంగా ఉన్నాయి.తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురం సూర య్యపేటలో కొన్ని గ్రామాల వారికి ఒకే చోట దాదాపు 1100 స్థలాలు కేటాయించారు. ఇక్కడ కేటాయించిన స్థలం లోతట్టు ప్రాంతంగా ఉందని, చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్నాయని విమ ర్శలు వినిపించాయి.అయినా నాయకులు పట్టించుకోలేదు. వేగేశ్వరపు రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఇచ్చిన స్థలాలు మాకొద్దంటూ భీష్మించారు. ప్రభభత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలని పదేపదే చెబుతున్నా 1100 స్థలాలకు సుమారు 400 మంది మాత్రమే పునా ది వేశారు.అది కూడా ప్రభుత్వ బెదిరింపులు కారణంగా హడావుడిగా పునాది వేసి వదిలేశారు. దీంతో ఇప్పటి వరకూ ఆ కాలనలో ఇళ్ల నిర్మాణం అంతంతమాత్రంగానే సాగుతోంది.

Updated Date - Dec 18 , 2023 | 12:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising