ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతులకు పరిహారం అందించాలి

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:33 AM

మిచౌంగ్‌ తుఫాన్‌కు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం పరిహారం అందించి ఆదుకోవాలని పంట నష్ట నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్‌ చేసింది. మిచౌంగ్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పంట నష్ట నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నిడదవోలు, కొవ్వూరు అబ్జర్వర్లు కటకంశెట్టి ప్రభాకర్‌, గొర్రెల శ్రీధర్‌, టీడీపీ రాష్ట్ర సెక్రటరీ కాశి నవీన్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు.

కొవ్వూరులో దెబ్బతిన్న అరటి తోటను పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

  • టీడీపీ పంట నష్ట నిజ నిర్ధారణ కమిటీ

  • పలు గ్రామాల్లో నష్టపోయిన పంటలు పరిశీలన

కొవ్వూరు/పెరవలి, డిసెంబరు 13: మిచౌంగ్‌ తుఫాన్‌కు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం పరిహారం అందించి ఆదుకోవాలని పంట నష్ట నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్‌ చేసింది. మిచౌంగ్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పంట నష్ట నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నిడదవోలు, కొవ్వూరు అబ్జర్వర్లు కటకంశెట్టి ప్రభాకర్‌, గొర్రెల శ్రీధర్‌, టీడీపీ రాష్ట్ర సెక్రటరీ కాశి నవీన్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు. కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణం, మండలం కుమారదేవంలో అరటి పంటలు, తాళ్లపూడి మండలం రాగోలపల్లి, పోచవరం గ్రామాల్లో పొగాకు పంటలను పరిశీలించారు. ద్విసభ్య కమిటీ మా ట్లాడుతూ నియోజకవర్గంలో పంట కాలువలు పూడిపోయి వర్షాలకు పంట పొలాలు ముంపుకు గురై రైతన్నలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారన్నారు. ఇం త జరిగినా వైసీపీ నాయకులు గాని, హోం మంత్రి గాని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల్లోని పంట, మురికి కాలువలు, కొవ్వాడ కాలువ ఆక్రమణలకు గురై పూడిపోవడంతో వర్షపునీరు ముందుకు పారే మార్గంలేక పంటలను ముంచివేసింది. వైసీపీ ప్రభుత్వం కాలువల్లో పూడికలు తీయకపోవడంతో వర్షాలకు పంటలు నష్టపోయి ప్రతి ఏడాది రైతులు నష్టాల బారిన పడుతున్నారన్నారు. వారి వెంట దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, సూరపనేని చిన్ని, పొట్రు శ్రీనివాసరావు, సూర్యదేవర రంజిత్‌, యనమదల సుబ్రహ్మణ్యం, తదితరులున్నారు.

  • 2,900 ఎకరాల్లో పంట నష్టం

నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఖండవల్లి, ముక్కామల గ్రామాల్లో పర్యటించారు. నీట ముగిసిన వరి చేలను, విరిగిన అరటి తోటలను, పాడైపోయిన కూరగాయల తోటలను పరిశీలించారు. నిడదవోలు నియోకవర్గంలో సుమారు 2,900 ఎకరాల్లో వివిధ రకాల పంట నష్టం జరిగి రూ.20 కోట్ల మేర రైతులు నష్టపోయారని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తుఫాన్‌ ప్రభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని విమర్శించారు. వారి వెంట అతికాల వెంకట రామకృష్ణ, భూపతిరాజు రవివర్మ, కడలి సత్యనారాయణ, నల్ల సురేంద్రర, వేండ్ర వెంకటరామ్మూర్తి, కంటిపూడి సూర్యనారాయణ, వాకలపూడి వీర్రాజు, సీహెచ్‌వీ సత్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising