ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తా

ABN, First Publish Date - 2023-12-03T01:37:55+05:30

రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తా

యానాం, డిసెంబరు 2: యానాం ప్రాంతీయ విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ సాధించి రాష్ట్ర స్థాయి(పుదుచ్చేరి)కి వెళ్లే విద్యార్థులకు ఆర్థికంగా సహకారం అందిస్తానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. శనివారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మల్లాడి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. సాయంత్రం స్థానిక చిల్డ్రన్స్‌ అడిటోరియంలో విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్‌ అధ్యక్షతన జరిగిన విద్యావైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి మల్లాడి హాజరయ్యారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. సర్వశిక్ష అభియాన్‌ఏడీపీసీ కమిడి ప్రభాకరరావు, దంగేటి త్రిమూర్తులు, పలువరు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T01:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising