మేముసైతం!
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:09 AM
నాలుగన్నరేళ్లలో సీఎం జగన్ మీకేం చేశారంటే.. చేసిందేం లేదు.. మా సంక్షేమం పట్టించుకున్నదే లేదంటారు ఉద్యోగులు.. ఎన్నికల ముందు మీకేది కావాలంటే అది చేస్తాం అంటూ గెలిచారు.. ఇప్పుడు అడిగితే తూచ్ అంటున్నారు.. ఈ నేపథ్యంలో డిమాండ్ల సాధనకు ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు..
తొలిరోజు పెన్‌డౌన్
ఉద్యోగులకు ‘సమగ్ర శిక్ష’
జిల్లాలో 414 మంది ఉద్యోగులు
కేంద్రం వాటా దారి మళ్లింపు
క్రమం తప్పిన సిబ్బంది జీతాలు
నాలుగు నెలలకోసారి నెల జీతం
ఆకలితో పస్తులుంటున్న వైనం
సీఎం హామీ నెరవేర్చాలని డిమాండ్
20 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిక
నాలుగన్నరేళ్లలో సీఎం జగన్ మీకేం చేశారంటే.. చేసిందేం లేదు.. మా సంక్షేమం పట్టించుకున్నదే లేదంటారు ఉద్యోగులు.. ఎన్నికల ముందు మీకేది కావాలంటే అది చేస్తాం అంటూ గెలిచారు.. ఇప్పుడు అడిగితే తూచ్ అంటున్నారు.. ఈ నేపథ్యంలో డిమాండ్ల సాధనకు ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు.. గత ఐదు రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టారు.. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించి స్వాధీనం చేసుకున్నాతగ్గేదేలే అంటున్నారు.. మరో వైపు ఆశా కార్యకర్తలు 36 గంటల పాటు మహాధర్నా చేశారు.. ఇప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగుల వంతు వచ్చింది..డిమాండ్ల సాధనకు మేముసైతం అంటూ శనివారం పెన్‌డౌన్ నిరసన చేపట్టారు.. 20వ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించారు.
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వం అధికార దండం చేపట్టిన తర్వాత అన్నిటి మాదిరిగానే ‘సమగ్ర శిక్ష’ కూడా సంకటంలో కొట్టుమిట్టాడుతోంది. వేతనాల వెతలు శ్రుతి మించిపోవ డంతో సిబ్బంది ‘దండం’ పెడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల గాడి తప్పి ముప్పుతిప్పలు పడుతోంది.కేంద్రం తన వాటా నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన అల వాటు ప్రకారం వాటిని దారి మళ్లిస్తుండడంతో సమగ్ర శిక్ష సిబ్బందికి జీతాలు క్రమం తప్పాయి. దీంతో ఈ ప్రభుత్వ హయాంలో కంటికి కనిపించని శిక్ష సమ గ్రం గా అనభవిస్తూ ‘మార్పు’ కోసం ఎదురు చూస్తున్నారు.
ఏమిటీ ‘సమగ్ర శిక్ష’
1 నుంచి 5వ తరగతి వరకూ మంచి ప్రమాణాలతో కూడిన విద్యను తక్కువ ఖర్చుతో ప్రతి విద్యార్థికీ అందజే యడం, నివాస ప్రదేశానికి దగ్గరలోనే పాఠశాల ఉండేట్లు చూడాలనే అత్యుత్తమ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘సర్వ శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)’ పథకాన్ని 2001లో ప్రారం భించింది. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం తో ఉన్నత పాఠశాల విద్యార్థులకు పదకొండో పంచవర్ష ప్రణాళికలో రూ.120 కోట్లను కేటాయించి 2009 మార్చి లో 6 నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్‌ఎస్ ఎస్‌ఏ)ని ప్రారంభిం చారు. ముఖ్యంగా 8 నుంచి పదో తరగతి వరకూ కంప్యూటర్‌పై,ల్యాబ్‌లలో భౌతికంగా అభ్యాసం చేయిం చి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం ఈ పథకం ము ఖ్యోద్దేశం.ఈ పథకానికి 75 శాతం నిధులు కేం ద్రం భరి స్తుండగా 25 శాతం రాష్ట్రాలు ఖర్చు చేయాలి.2018లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, సర్వశిక్షా అభియాన్, ఉపాధ్యాయ విద్యపై కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ ఎస్‌టీఈ) కలిపి ‘సమగ్ర శిక్ష’గా మార్చారు.
జిల్లాలో 414 మంది ఉద్యోగులు..
జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో సైట్ ఇంజనీర్లు 5, ఎంఆర్‌సీ మెస్సెంజర్(అటెండర్లు, స్వీపర్లు), ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 16 మంది, భవిత టీచర్లు 36, ఆయాలు 19, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్లర్లు ఆర్ట్ ఎడ్యుకేషన్‌కి 89, వర్క్ ఎడ్యుకేషన్‌కి 109, ఫిజికల్ ఎడ్యుకేషన్ 29, సీఆర్పీలు 72, జిల్లా కార్యాలయంలో 20 కలుపుకొని మొత్తం 414 మంది జిల్లాలో విధులు నిర్వ హిస్తున్నారు.వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారు ఓ పది మంది మినహా మిగతావారందరూ ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీళ్లకు రూ.6 వేల నుంచి రూ.22 వేల వర కూ జీతాలు ఉన్నాయి.నెలకు సుమారు రూ.85-88 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుం ది.దీనిలో కేంద్రం వాటా మూడొంతులు ఉన్నా ఎందుకనో జీతాలు సక్రమంగా అందడం లేదు. ఈ ఏడాది జూన్, జూలై జీతాలు సెప్టెంబరులో ఆగస్టు నెల జీతాలు అక్టోబరులో అందగా.. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపిన తర్వాత సెప్టెంబరు, అక్టోబరు నెల వేతనాల విడుదలకు చర్యలు తీసుకున్నారు.అవి మరో రెండు రోజుల్లో ఖాతా ల్లో జమవుతాయని సమాచారం.అయితే నవంబరు నెల జీతం ఎప్పుడొస్తుందో దైవాధీనమని ఉద్యోగులు ఆవే దన చెందుతున్నారు. 400 మందికిపైగా చిన్న జీతం వచ్చే ఉద్యోగులే. వీరికి టీఏ, డీఏ వంటి ఎలవెన్సులు ఉండవు. దీంతో కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులో ఊబిలో కూరుకు పోతూ యాతన పడుతు న్నామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
నిర్మాణాలూ అంతే..
ఈ ప్రభుత్వంలో ‘సమగ్ర శిక్ష’ పేరుకు తగినట్టే నిర్వహణ శిక్షగా మారింది. కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నా సిబ్బందికి జీతాలు కూడా క్రమంగా ఇవ్వకపోగా ఆర్‌ఎం ఎస్‌ఏ పథకంలో భాగంగా నిర్మాణం చేపట్టిన భవనాలు మూడేళ్లుగా తుది రూపుకు ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 81 ఉన్నత పాఠ శాలల్లో అభ్యాసానికి అవసరమైన వసతుల కల్పనకు 91 భవనాల నిర్మాణం చేపట్టారు. 40 శాతం పనులకు మా త్రమే నిధులు వచ్చాయి. నిర్మాణాలు మధ్యలో వదిలి వేయలేక విద్యా కమిటీ వాళ్లు అప్పులు చేసి మరీ 70 శాతం వరకూ పూర్తి చేశారు.తర్వాత ఈ భవనాల ఊసు ప్రభుత్వం మరిచిపోయింది. నిర్మాణాలకు ఖర్చు చేసిన వాళ్లు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఆ ఆదేశాలకు అనుగు ణంగా బిల్లులు చెల్లిస్తున్నారంటే ‘సమగ్ర శిక్ష’ జిల్లాలో ఎలా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కార్యాల యంలో సరైన సదుపాయాలు లేకపోవడం గమనార్హం.
ఉద్యోగుల ‘పెన్ డౌన్’
ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం తమ సమస్య లను పెడచెవిన పెడుతుండడంతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ‘సమగ్ర శిక్ష’లోకి వచ్చే ఎంఐఎస్, డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్), సీఆర్పీలు, పీటీఐ, ఐఈ ఆర్టీలు, ఆఫీస్ సబార్డినేట్‌లు పెన్‌డౌన్‌కి సిద్ధపడ్డారు. 16 నుంచి పెన్‌డౌన్ ద్వారా నిరసనలోకి వెళ్లారు. ప్రభుత్వ సానుకూల స్పందన కోసం 19 వరకూ ఎదురు చూస్తామని.. న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర జేఏసీ నిర్ణయంతో 20 నుంచి ధర్నాలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని, గత ప్రభుత్వంలో ఇచ్చి న టీఏ, డీఏలు పునరుద్ధరించడంతో పాటు వాటిని పెం చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
రేపు కలెక్టరేట్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
గోపాలపురం, డిసెంబరు 16 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసి స్టెంట్ల న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోరు తూ సీఐటీయూరాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలె క్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేప డుతున్నట్టు రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల ఉపాఽధ్యక్షుడు ఏఎన్‌వీ మహేష్ తెలిపారు.ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి హామీ పథ కంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, మ్యాన్‌డేస్ విధానం రద్దు తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమానికి పిలపుని చ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మె విజయ వంతం చేయాలని కోరారు.
Updated Date - Dec 17 , 2023 | 12:09 AM