వైద్యులను సత్కరించిన జిల్లా ఎస్పీ
ABN, First Publish Date - 2023-11-10T01:22:55+05:30
పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా ఉచిత మెడికల్ క్యాంపులో జిల్లా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందజేసిన పలువురు వైద్యులను జిల్లా ఎస్పీ జగదీష్ ఘనంగా సత్కరించారు.
రాజమహేంద్రవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా ఉచిత మెడికల్ క్యాంపులో జిల్లా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందజేసిన పలువురు వైద్యులను జిల్లా ఎస్పీ జగదీష్ ఘనంగా సత్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గాభవాని, ఆర్థోపెడిక్ డాక్టర్ ప్రదీప్‌కుమార్, పిడియాట్రీషియన్ డాక్టర్ వినయ్ మెహతా, జనరల్ సర్జన్ డాక్టర్ రవికుమార్, జనరల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఆర్.రాజశేఖరరెడ్డి, డెంటిస్ట్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ జయరాం చంద్ర, ఆప్తమాలజిస్ట్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావులను సత్కరించారు. మెగా ఉచిత మెడికల్ క్యాంపును ఆర్గనైజింగ్ చేసిన అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎస్‌ఆర్.రాజశేఖర్‌రాజు, ఆర్‌ఐ(అడ్మిన్)యు.శ్రీనివాస్, ఆర్‌ఐ (వెల్ఫేర్) పి.సంజీవ్‌కుమార్‌తో పాటు జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.రఘురామ్‌లను కూడా ఎస్పీ జగదీశ్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు.
Updated Date - 2023-11-10T01:22:56+05:30 IST