యువతకు లక్ష్యం ఉండాలి
ABN, First Publish Date - 2023-11-04T00:05:26+05:30
యువతకు లక్ష్యం ఉండాలని ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్/సిటీ, నవంబరు 3 : యువతకు లక్ష్యం ఉండాలని ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో శుక్రవారం తిలక్‌రోడ్డులో నిర్వహించిన యువత-హరిత కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఏపీలో అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. ఇండియా టీమ్ చాలా బాగా ఆడుతుందని ఇదే ఒరవడి కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. యువత కలిసిమెలిసి రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లడానికి ముందుకు రావాలన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ ఫ్లడ్‌లైట్లతో రాజమహేంద్రవరం నగరంలో రెండు క్రికెట్ స్టేడియంలు రాబోతున్నాయన్నారు. నన్నయ వర్శిటీ ప్రాంగణంలో కేంద్ర నిధులతో ఇండోర్ స్పోర్ట్సు స్టేడియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం కంబాలచెరువు పార్కు, పుష్కరప్లాజా, లేజర్ షోలను పరిశీలించారు.కార్యక్రమంలో వైసీపీ అర్బన్ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-04T00:05:28+05:30 IST