ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బస్‌ యాత్ర..తుస్‌!

ABN, Publish Date - Dec 18 , 2023 | 01:00 AM

వైసీపీ బస్‌ యాత్ర తుస్‌ తుస్‌ మంది.. హడావుడి తప్ప అమలు సాధ్యం కాలేదు. పథకాలు కట్‌ చేస్తామని బెదిరించి వేలాదిగా మహిళలను తరలించినా వారి పట్టించుకునే వారే కరువ య్యారు.

సభకు జనమేరి : సభ జరుగుతుండగానే ఖాళీ అయిన కుర్చీలు

మంత్రులు మాట్లాడుతుండగానే కుర్చీలు ఖాళీ

సభ ఆరంభంలోనే వెనుతిరిగిన మహిళలు

అడ్డుకోబోయిన పోలీసులు

అయినా పట్టించుకోని వైనం

ఖాళీ కుర్చీలకే మంత్రుల ఉపన్యాసం

గంటలోనే ముగిసిన సభ

రోడ్డుపై బహిరంగ సభతో తీవ్ర ఇక్కట్లు

దేవరపల్లి/గోపాలపురం, డిసెంబరు 17: వైసీపీ బస్‌ యాత్ర తుస్‌ తుస్‌ మంది.. హడావుడి తప్ప అమలు సాధ్యం కాలేదు. పథకాలు కట్‌ చేస్తామని బెదిరించి వేలాదిగా మహిళలను తరలించినా వారి పట్టించుకునే వారే కరువ య్యారు.దీంతో సభ జరుగుతుండగానే వారంతా వెనుతిరిగారు. ఎవరి బస్‌ వద్దకు వారు వెళ్లి రోడ్డుపైనే పడిగాపులు కాశారు. సభ ఆరంభం నుంచి ముగింపు వరకు కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. వైసీపీ నాయకులు దేవరపల్లిలో నిర్వహిం చిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ జనంలేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. నయానో భయానో భయపెట్టి బస్సులు, ఆటోల్లో మహిళలను తరలిం చారు. అయితే సభ ప్రారంభదశలోనే వారు వెనుదిరిగారు. ఆదివా రం సాయంత్రం 4.30 గంటలకు సభ ప్రారంభమైంది. సభకు గంట ముందుగానే మహిళలను సభా ప్రాంగ ణానికి తరలించారు. ఒక్కొక్కరుగా నాయకులు వచ్చే లోపునే సభా ప్రాంగణం మొత్తం ఖాళీ అయిపోయంది. మహిళలను కట్టడి చేయడానికి పోలీసులు నానా తం టాలు పడ్డారు. ఎలాగైనా మహిళలను సభాప్రాంగణం నుంచి బయటకు వెళ్ల కుండా చూడాలనే ఉద్దేశంతో బారికేడ్లను దగ్గరకు లాగి పోలీసులు అడ్డుగా నిలబడే పరిస్థితి నెలకొంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కళ్లెదుట ఉన్న కుర్చీల్లో ప్రజలు ఉన్నారో లేదో కూడా గ్రహించకుండా ఉపన్యా సాలతో ఊదరగొట్టారు.సభాప్రాంగణం వెలవెలబోతున్నా తమకేమీ పట్టనట్టు ఉపన్యాసాలను కొనసాగిస్తూనే ఉన్నారు. మంత్రులు ప్రతిపక్ష పార్టీల పై తమ ఉపన్యాసాలతో దుమ్మెత్తి పోస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.

‘టీడీపీలో సంక్షేమం కుంటినడక’..

దేవరపల్లి/గోపాలపురం, డిసెంబరు 17: అంబేడ్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌లు కలలు కన్న ఆశయ సాధకుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఆదివా రం దేవరపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లా డారు. ప్రాజెక్టులు అడ్డుపెట్టుకుని చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, సొంత సామా జిక వర్గానికి చెందిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం కుంటినడక నడిచిందన్నారు. పేదలు ఆంగ్లం నేర్చుకోవడం..సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించు కోవడం ప్రతిపక్షాలకు నచ్చక విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న పాలనలో విద్యా, వైద్యం, ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.ఈ కార్యక్ర మంలో రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గని భరత్‌ రామ్‌, నందిగం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

దారి మూసేసి.. బహిరంగ సభ

ఉదయం 8 నుంచి ప్రయాణికులకు ఇక్కట్లు

సామాజిక సాధికార బస్సు యాత్రలో బాగంగా ఎమ్మెల్యే తలారి నివాసం సమీపంలో ఆదివారం నిర్వహించిన సభతో ప్రయాణీకులు నానా ఇబ్బందులుపడ్డారు. సభ ఏర్పాటు చేసేందుకు ఉదయం 8గంటల నుంచి పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించి వాహనాలు వెళ్ళకుండా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో రాజమండ్రి నుంచి నల్లజర్లవైపు వెళ్ళే ప్రయాణీకులు దేవ రపల్లి ప్రధాన సెంటర్‌ నుంచి సుమారు 6కిలోమీటర్లు పైబడి ప్రయాణీంచి యర్నగూడెం వరకు 6కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో ఆదివారం ప్రయాణీకులు సభాఏర్పాట్లతో నానా తంటాలుపడ్డారు.

Updated Date - Dec 18 , 2023 | 01:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising