బిహార్ సీఎం నితీశ్‌కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ ధర్నా
ABN, First Publish Date - 2023-11-10T00:24:49+05:30
బిహార్ సీఎం నితీశ్‌కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ ధర్నా
అమలాపురం టౌన్, నవంబరు 9: బిహార్ అసెంబ్లీలో మహిళల పట్ల ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ గురువారం మహిళామోర్చా జిల్లాశాఖ అధ్య క్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో అమలాపురంలో ధర్నా నిర్వహించారు. నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా పెద ఎత్తున నినాదాలు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన సీఎం తక్షణం రాజీనామా చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆకుమర్తి బేబిరాణి డిమాండు చేశారు. ధర్నాలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంక టసుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుమర్తి కోకిల, ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మి, జగతా శాంతి, కర్రి తాతారావు, దూరి రాజేష్, కొండేటి ఈశ్వర్‌గౌడ్, ఎన్.సీతామహలక్ష్మి, బొంతు శివాజీ, అరిగెల తేజ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-10T00:24:50+05:30 IST