ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్‌కు ఉచిత శిక్షణ

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:16 AM

ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ప్రిలిమనరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు పి.సత్యరమేష్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 16: ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ప్రిలిమనరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు పి.సత్యరమేష్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని బీసీ స్టడీసర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్రూప్‌-2కు ఈనెల 22వ తేదీ, గ్రూప్‌-1కు 31వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని ఆయన తెలిపారు. గ్రూప్‌-2లో 100 మంది అభ్యర్థులకు ఈనెల 27వ తేదీ నుంచి 50 రోజులపాటు, గ్రూప్‌-1 అభ్యర్థులకు జనవరి 5వ తేదీ నుంచి 60 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీమెటీరియల్‌ ఇస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ జిల్లా, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు స్టడీ సర్కిల్‌ నెంబరు 0883-2421129ను సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - Dec 17 , 2023 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising