భావసారూప్యతగల పార్టీలతో కలిసి ఎన్నికలకు సిద్ధం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:59 AM
భావ సారుప్యత కలిగిన పార్టీలతో పాటు ఇతర ప్రజా సంఘాలతో కలిసి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైనట్టు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు
అమలాపురంరూరల్, డిసెంబరు 17: భావ సారుప్యత కలిగిన పార్టీలతో పాటు ఇతర ప్రజా సంఘాలతో కలిసి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైనట్టు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సెక్యులర్ స్ఫూర్తితో ముందు కు వెళతామన్నారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఐదు అంశాలకు ప్రాధాన్యమిస్తే తెలంగాణ ఎన్నికల్లో ఆరు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి మేనిఫెస్టోను రూపొందించి విజయం సాధించామన్నారు. అదే తరహాలో కేంద్ర మేనిఫెస్టో కమిటీ అనుమతి తీసుకుని కేంద్ర, రాష్ట్ర అంశాలను వివరిస్తూ ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొంది స్తున్నట్టు వివరించారు. కేంద్ర పరిధిలోని రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా, పోలవ రం జాతీయ ప్రాజెక్టు విభజన హామీల అమలు వంటి అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించి రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా అమలాపురం రూరల్ బండారులంకలో కాంగ్రెస్‌జిల్లాశాఖ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు అధ్యక్షతన జిల్లాకాంగ్రెస్ నాయకుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రుద్రరాజు మాట్లాడుతూ 2024 జనవరి 20 నుంచి కాంగ్రెస్ రూపొందిం చిన మేనిఫెస్టోతో ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. నాడు కాంగ్రెస్‌పార్టీ అమలుచేసిన పథకా లకు నేడు జగన్ పేరు తగిలించుకుని ప్రచారం చేసుకుం టున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేశామన్నారు. దీనిలో భాగంగా మండలస్థాయి నాయకులకు వచ్చే నెలలో ఓరియంటేషన్ శిక్షణ చేపట్టామన్నారు. జనవరి 5న విశాఖపట్నంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖప ట్నాలకు సంబంధించిన పార్టీ ప్రముఖులతోను, 6న రాజమహేంద్రవరంలోను, 7న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రతినిధులతో, 8న ఒంగోలు, 9న కడపలోను ఒరియంటేష న్ జరుగుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల సుభాషి ణి, చీకట్ల అబ్బాయి, కుడుపూడి శ్రీనివాస్, వంటెద్దు బాబి, మహబూబ్ షకీలా, అడపా వీరనూకమాచరరావు, అయితాబత్తుల కుమార్‌సింగ్, యార్లగడ్డ రవీంద్ర, రాయుడు వెంకటరమణ, దోని పాటి విజయలక్ష్మి, సాధనాల చినసత్య నారాయణ, గెడ్డం సురేష్‌బాబు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:59 AM