ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీర్‌ బాటిల్‌తో యువకుడిపై దాడి

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:36 AM

ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఈట్‌స్ట్రీట్‌లో జరిగిన గలాటాలో ఓ యువకుడిపై దాడి జరిగింది. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన బి.సత్య సాయికుమార్‌ ఆదివారం రాత్రి ఈట్‌స్ట్రీట్‌కి వెళ్లాడు.

రాజమహేంద్రవరం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఈట్‌స్ట్రీట్‌లో జరిగిన గలాటాలో ఓ యువకుడిపై దాడి జరిగింది. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన బి.సత్య సాయికుమార్‌ ఆదివారం రాత్రి ఈట్‌స్ట్రీట్‌కి వెళ్లాడు. అదే సమయంలో ఆరుగురు కలిసి ఒక వ్యక్తిని కొడుతున్నారు. గొడవ ఆపుదామని సాయికుమార్‌ వెళ్లగా అప్పటికే పూటుగా మందు తాగి గొడవ పడుతున్న యువకులు సాయికుమార్‌ని బీర్‌ బాటిల్‌తో తలపై బలంగా కొట్టగా తీవ్ర రక్త స్రావమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరు కుట్లు పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న వాళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. సాయికుమార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌ పేర్కొన్నారు. కాగా.. బాలికల వసతి గృహాల వద్ద ఉన్న ఈట్‌స్ట్రీట్‌లో రాత్రి వేళల్లో జరుగుతున్న దందాలు.. పొంచివున్న ప్రమాదంపై ‘ఆంధ్రజ్యోతి’ గతంలో హెచ్చరించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

Updated Date - Dec 26 , 2023 | 12:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising