ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అవినీతిని ప్రశ్నిస్తే కేసులు.. అరెస్టులా? : వేగుళ్ల

ABN, First Publish Date - 2023-11-10T00:23:42+05:30

అవినీతిని ప్రశ్నిస్తే కేసులు.. అరెస్టులా? : వేగుళ్ల

మండపేట, నవంబరు 9: రాష్ట్రంలో రాక్షసపాలన జరుగుతోందని, ఇప్పటివరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తనకు నాలుగున్నరేళ్ల నుంచి పైసా నిధులు కూడా ఇవ్వ లేదని ప్రభుత్వ తీరుపై మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ధ్వజమెత్తారు. మండపేట పట్టణంలో ఎమ్మెల్యే వేగుళ్ల స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వేగుళ్ల మాట్లాడుతూ గ్రావెల్‌ను నియోజక వర్గంలో ఎక్కడికి లారీలు ద్వారా తరలిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాత్రిపగలు వందలాది లారీల్లో గ్రావెల్‌ దోపిడీ చేస్తున్నారని వేగుళ్ల ఆరోపించారు. తాము గ్రావెల్‌ తవ్వకాలపై చేస్తున్న ఆందోళన నేపథ్యంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మెరక చేసిన జగన్న కాలనీలు, గ్రామాల్లో రహదారులు, వేసినవి చూపించగలరా? అని వేగుళ్ల ప్రశ్నించారు. మీరు 13 రోజులు తరలించిన గ్రావెల్‌ ఎక్కడకి తరలించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జనవరికి జగనన్న లేఅవుట్‌ రెడీ చేస్తాం: తోట

గ్రావెల్‌ తవ్వకాలు చేసి నియోజకవర్గంలో ఉన్న జగనన్న లేఅవుట్‌లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం కోసం వినియో గిస్తున్నాం. ఎవరు తవ్వకాలను అడ్డుకోవాలని చూసినా తగ్గేదే లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గురువారం మండపేటలో విలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు. కేశవరంలో లబ్ధిదారు లకు ఇచ్చిన ఇళ్లస్థలాలు జగనన్న లేఅవుట్‌ను జనవరి నాటికి సిద్ధంచేసి అందిస్తాం. ఎమ్మెల్యే వేగుళ్ల కేశవరం వెళ్తానని ప్రకటించినప్పుడు పోలీసులు గృహనిర్బంధం చేసి వదిలేసిన ప్పుడు వల్లూరువెళ్లి జనసేన నాయకుడు లీలాకృష్ణను కలవ డంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ఇదేగ్రా వెల్‌ తవ్వకాల విషయంలో గతంలో ఇద్దరు నేతల మధ్య పం చాయితీ నడిచిన విషయం వాస్తవం కాదా అని తోట ప్రశ్నించారు.

Updated Date - 2023-11-10T00:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising