ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలి

ABN, Publish Date - Dec 21 , 2023 | 12:50 AM

సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని వెంటనే రద్దుచేయాలని కొవ్వూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బొబ్బా భారతి డిమాండ్‌ చేశారు.

రిలే నిరాహారదీక్షలు చేపట్టిన న్యాయవాదులు

కొవ్వూరు, డిసెంబరు 20 : సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని వెంటనే రద్దుచేయాలని కొవ్వూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బొబ్బా భారతి డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారా దీక్షలు చేపట్టారు. కొవ్వూరు తహసిల్దార్‌ బి.నాగరాజనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ ప్రభుత్వం హడావుడిగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 27-2023 రద్దు చేయాలన్నారు. ఈ యాక్టు రద్దు చేసేవరకు ప్రజలు, రైతుల పక్షాన న్యాయవాదులు పోరాటాలు చేస్తామన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వలన ప్రజలకు జరి గే నష్టాల్ని వివరిస్తామన్నారు. ఈ యాక్టు వలన ప్రజలకు ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. తక్కెళ్ల చిట్టిబాబు, నిమ్మగడ్డ పుల్లారావు, దొండపాటి కృష్ణ, పిల్లలమర్రి మురళీకృష్ణ, ఎంవీఎస్‌ రామారావు, ఎం.శ్రీవల్లీ, పి. తారాకుమారి, ఎం.అనూహ్య, రాజాన శ్రీనివాస్‌, కె.సూర్యనారాయణ, లక్ష్మి, ఎన్‌.రవి, ఏలూరి గోపాలకృష్ణ, శ్రీరా ముల నాగ మునీంద్ర, వీరంశెట్టి రాజా వరప్రసాద్‌, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు.

నిడదవోలులో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు

నిడదవోలు: నిడదవోలు పట్టణంలోని జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టువద్ద రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ హక్కు చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదు

Updated Date - Dec 21 , 2023 | 12:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising