ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు అంగన్‌వాడీల ఆందోళన
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:14 AM
అంగన్‌వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో కనీసం కళ్లు తెరచి మా సమస్యల పరిష్కారం మీద దృష్టిపెట్టాలని కోరుతూ అంగన్‌వాడీలు బుధ వారం జిల్లాలోని మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ కార్యాల యాన్ని, ఎమ్మెల్యేల ఇళ్లను, కార్యాలయాలను ముట్టడించారు.
రాజమహేంద్రవరం (ఆంరఽధజ్యోతి), డిసెంబరు 27 : అంగన్‌వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో కనీసం కళ్లు తెరచి మా సమస్యల పరిష్కారం మీద దృష్టిపెట్టాలని కోరుతూ అంగన్‌వాడీలు బుధ వారం జిల్లాలోని మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ కార్యాల యాన్ని, ఎమ్మెల్యేల ఇళ్లను, కార్యాలయాలను ముట్టడించారు. అయితే ఉద యం నుంచి సాయంకాలం వరకూ పడిగాపులు పడి నిరసన తెలిపినా వైసీపీ ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోలేదు. కొవ్వూరులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడిం చారు. టౌన్ సీఐ వి.జగదీష్ వాళ్లను అడ్డుకున్నారు. తర్వాత వినతిపత్రం ఇచ్చారు. ఎంపీ మార్గాని భరత్ ఓపికపట్టండని చెప్పగా, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మీ సమస్యలేంటో నాకు తెలియదు, రాసివ్వండని అనడం గమనార్హం. దేవరపల్లిలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంక ట్రావు కార్యాలయం వద్ద రోడ్డు మీద మహిళలు ఎండలోనే నిరసన తెలి పారు. నిడదవోలులో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడుకూ ఈ సెగ తగిలింది.
ఎంపీ కార్యాలయం వద్ద నిరసన
ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తుండడంతో ఎంపీ భరత్‌రామ్ కార్యా లయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు బుధవారం పెద్ద సం ఖ్యలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యాళ్ల బేబీ రాణి, ఇతర సంఘాల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభు త్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అంగన్వాడీలు దొంగలని చెప్పి ఓ కమిష నర్ అవినీతి చేస్తూ దొరికేశారన్నారు. మా సమ్మె న్యాయమైనదేనని ఆయ న ఇప్పుడు అంటున్నారని.. కేంద్రాలకు తనిఖీకి వచ్చినప్పుడు మా బాధలు తెలియలేదా అని ప్రశ్నించారు. సీఎంకి ఈ విషయాలేమీ తెలియదని చెబుతూ మంత్రి బొత్సా బొంకుతున్నారని విమర్శించారు. 16 రోజుల నుం చి అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా స్పందన కరువైం దన్నారు. ఇదే ఎంపీకి ఓటు వేసి మోసపోయామన్నారు. అక్కాచెల్లెమ్మలం టూనే భస్మాసుర హస్తాన్ని తమ నెత్తిపై పెట్టడానికి ప్రయత్నిస్తున్నార న్నారు. ఆ చెయ్యి వారి నెత్తిపైనే పెట్టిస్తామన్నారు. సమ్మెకు వస్తూ ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతున్నారని ఆ పాపం సీఎం జగన్‌కే తగు లుతుందన్నారు. సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చున్నా ఎవరూ తమ పిల్లలను పంపించడం లేదన్నారు. కాగా ఉదయం 9 గంట ల నుంచి అంగన్వాడీలు ఎంపీ కార్యాలయం వద్ద బైఠాయించగా.. మధ్యా హ్నం 2.30 గంటల ప్రాంతంలో ఎంపీ వారి వద్దకు చేరుకున్నారు. ఎంపీకి వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్ మూర్తి, ట్రెజరర్ కేఎస్వీ రామ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 01:14 AM