ఆమ్‌ఆద్మీ నాయకుల శ్రమదానం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:28 AM
కాకినాడ సిటీ/రూరల్, డిసెంబరు 17: రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చండి మహాప్రభో అంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా నాయకులు కాకినాడ- సామర్లకోట రోడ్డులో గుంతల వద్ద ఆదివారం నిరసన తెలిపి శ్రమదానం చేసి గుంతలను పూడ్చారు. ఆప్ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అధ్యక్షతన జరిగిన శ్రమదానంలో సొంత డబ్బులతో మెటీరియల్‌ను సమకూర్చుకుని నాయకులంతా కలిసి గుం తలను పూడ్చి రోడ్డును సరిచేశారు. నాయకులు మాట్లాడుతూ
కాకినాడ సిటీ/రూరల్, డిసెంబరు 17: రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చండి మహాప్రభో అంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా నాయకులు కాకినాడ- సామర్లకోట రోడ్డులో గుంతల వద్ద ఆదివారం నిరసన తెలిపి శ్రమదానం చేసి గుంతలను పూడ్చారు. ఆప్ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అధ్యక్షతన జరిగిన శ్రమదానంలో సొంత డబ్బులతో మెటీరియల్‌ను సమకూర్చుకుని నాయకులంతా కలిసి గుం తలను పూడ్చి రోడ్డును సరిచేశారు. నాయకులు మాట్లాడుతూ హెలికాప్టర్‌లో తిరిగే సీఎం జగన్‌కు సామాన్య రోడ్లపై వెళ్లే ప్రయాణికుల సమస్యలు అర్ధంకావన్నారు. వైసీ పీ ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై దృష్టిసారించి తక్షణమే కనీసం గుంతలనైనా పూడ్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు టి.వరదరాజు, శీతల్ మద న్, కె.కృష్ణమోహన్, ఎం.రామ్మోహన్, రామారావు,రాంబాబు,కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, సత్యనారాయణ, మణిబాబు, లక్కీ, రాజాకృష్ణ, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:28 AM