సర్వలోక రక్షకుడు ఏసు ప్రభువు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:54 AM
మానవాళి ఏ విధంగా మసలుకోవాలో ప్రపంచానికి చాటిచెప్పిన ఏసు ప్రభువు సర్వలోక రక్షకుడని, తన జీవితాన్ని సందేశాత్మకంగా చూపిన మహాత్ముడని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కరప, డిసెంబరు 25: మానవాళి ఏ విధంగా మసలుకోవాలో ప్రపంచానికి చాటిచెప్పిన ఏసు ప్రభువు సర్వలోక రక్షకుడని, తన జీవితాన్ని సందేశాత్మకంగా చూపిన మహాత్ముడని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుస్తూ, ఎదుటి మనిషిపై ప్రేమ, కరుణ చూపాలన్నారు. క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో భాగంగా సోమవారం ఆయన గొడ్డటిపాలెంలోని ఫెయిత్ గాస్పెల్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ కె.డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబును జడ్పీటీసీ యాళ్ళ సుబ్బారావులను పాస్టర్ డేవిడ్‌రాజు సత్కరించారు. కార్యక్రమంలో గొడ్డటిపాలెం, అరట్లకట్ట సర్పంచ్‌లు వాసంశెట్టి శ్రీనుబా బు, గోపిసత్యవేణి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సింగినేని చినబాబు పాల్గొన్నారు.
మండలంలోని యండమూరులో గాస్పల్ బాప్టిస్ట్ చర్చిలో రెవరెండ్ జాన్ సూర్యప్రకాష్ 100మంది పేదలకు బట్టలు పంచారు. బిషప్ కె.అబ్రహం శామ్యూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ డాక్టర్ పి. డేవిడ్‌రాజు, సెక్రటరీ ఆర్.ప్రతాప్‌కుమార్, ట్రెజర్ కె.ఆనంద్‌బాబు, చైర్మన్ శామ్యూల్ రాజు, కన్వీనర్ పి.సత్యప్రసాద్ పాల్గొన్నారు.
చర్చిల్లో జనసేన రూరల్ ఇన్‌చార్జ్ పంతం నానాజీ 52వేల కేకులను అన్ని చర్చిలకు పంపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ అబ్రహం శ్యామ్యూల్ పేత్ గాస్పల్ చర్చిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పంతం నానాజీ, ఆయన సతీమణి పంతం అరుణ, వారి కుమారులు సందీప్, జనసేన నాయకులు, పేరున ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
తుని రూరల్: ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. తుని టీడీపీ ఇన్‌చార్జ్ యనమల దివ్య తుని పట్టణంలో ప్రధాన చర్చిల్లో జరిగే ప్రార్ధనలకు హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురికి బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, మళ్ళ గణేష్, కుక్కడపు బాలాజీ, నక్కా సునీల్‌తో పాటుగా జనసేన క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు.
పెదపూడి: మండలంలో క్రిస్మస్ వేడుకలు అంబ రాన్ని అంటాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురష్కరించుకుని చర్చిలను విధ్యుద్దీపాలతో అలంకరించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా భక్తులు చర్చిలలో ప్రార్ధనలలో పాల్గొన్నారు. గ్రామాలలో కొవొత్తులతో ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ సోదరులు కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
రౌతులపూడి : మండలంలోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఏసు పాటలు పాడుతూ క్రేస్తవ సొదరులు వేడుకలకు ఘనంగా స్వాగ తం పలికారు. ప్రత్యేక ప్రార్ధనలు, క్రిస్మస్ గీతాలు అలపించారు. క్రీస్తు జీవిత వృత్తాంతం గురించి పాటలు, ఆటలు నృత్య ప్రదర్శనలు అలరించాయి.
కొత్తపల్లి: మండలంలో సోమవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా వాకతిప్ప యండపల్లి జంక్షన్‌కు చెందిన చర్చి నిర్వాహకులు తెల్లవారుజామున క్రిస్మస్ తాత వేషధారణలతో గ్రామస్తులను అలరించారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట, నాగులాపల్లి తదితర గ్రామాల్లో కిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
నాగులాపల్లిలో: వైసీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో పాల్గొన్న 1000 మంది నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేశారు.
పిఠాపురం: పిఠాపురం పట్టణం, మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో ఉదయం నుంచే క్రైస్తవ భక్తులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. బీబీసీ చర్చిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉదయ్ శ్రీనివాసు పాల్గొన్నారు. మండలంలో చిత్రాడ, ఎల్‌ఎన్‌పురం, జములపల్లి, గోకివాడ, విరవాడ, కుమారపురం, రాపర్తి తదితర గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏబీసీ, బీసీ చర్చిల్లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ పాల్గొన్నారు.
పెద్దాపురం : పట్ణణ, మండల పరిధిలోని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్దలతో సోమవారం నిర్వహించుకున్నారు. ప్రార్థనా మందిరాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు.
గండేపల్లి: క్రిస్మస్ సందర్భంగా మండలంలో విద్యుత్‌కాంతులతో క్రైస్తవ భక్తుల ప్రార్ధనలతో సందడిగా మారాయి. మండలంలో జెడ్‌రాగంపేటలో ఉన్న పెనీమీల్ చర్చ్‌లో ఉన్న ఫాస్టర్లు లాజరస్ సురేంద్రకుమార్‌సుదర్శన్ ఆధ్వర్యంలో క్రిస్మస్‌వేడుకలు ఘనంగా జరిగాయి.
సామర్లకోట: సామర్లకోట పట్టణంలో ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, సెంటినరీ బా ప్టిస్ట్ చర్చి, ఏఈఎల్‌సీ, షాలేము బాప్టిస్ట్ చర్చిలను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జీ.అరుణ తదితర కౌన్సిలర్లు సందర్శించారు. మండలంలోని వేట్లపాలెం, జీ.మేడ పాడు, వీకె.రాయపురం, మాధవపట్నం, పనసపాడు తదితర గ్రామాలలో క్రైస్తవ ప్రార్ధనా మందిరాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పనసపాడు లోని పల్లపువీధిలో యెహోవాయీరే ప్రార్ధనా మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడు కలలో పాస్టర్ ఎన్.ప్రభుదాసు దైవసందేశం ఇచ్చారు. కార్యక్రమంలో యాదిద్య, సిస్టర్ ఛాయా, ఏంజెల్ తదితర సంఘస్తులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంటినరీ బాప్టిస్ట్ దేవాలయంలో పాస్టర్లు జి. సుందర్రావు, ఇంజనీరు మోహన్, రెవరెండ్ ఐజక్ విలియం ప్రసాద్, సంఘ అధ్యక్షుడు సంజీవరావు, సంఘస్తులు మోహన్‌శశిధర్, భాగ్యరత్నం, శుజానమ్మ, చంద్రలీల, తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వ రం, పెద్దనాపల్లిలో పాస్టర్లకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి)దుస్తులు, స్వీట్లు పంచారు. ప్రపంచం అంతా శాంతితో నిండి ఉండాలని ఏసుప్రభువు సందేశాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఎంపీపీ కోరారు.
పలు నాటక ప్రదర్శనలు
క్రిస్మస్ సందర్భంగా సిరిపురంలో లూధరన్ చర్చిలో ప్రసిద్ది చెందిన క్రీస్తు జననం ప్రదర్శన ద్వారా ప్రజలకు తెలియజేశారు. కొవ్వొత్తులు వెలిగించి దేవుడిని ఆరాధిస్తూ పిల్లలు, పెద్దలు నాటిక ప్రదర్శనలు వేసి ఏసుక్రీస్తు జననం, దృశ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజ్‌కుమార్, సర్పంచ్ పీతల నూకరాజు, విశ్రాంతి ఉద్యోగి అనపర్తి భాను, గ్రామ సెక్రటరీ వర్మ, అల్లం ఆదినారాయణ పాల్గొన్నారు.
అలాగే ఏలేశ్వరం రిప్యూజ్‌చర్చిలో పాస్టర్ జాకబ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిఽథిగా ప్రత్తిపాడు టీడీపీ ఇన్ చార్జ్ వరుపుల సత్యప్రభ హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణ స్వామి, కోనాల వెంకటరమణ, ఎండగుండి నాగబాబు, పెడ్ర శ్రీను, యాళ్ళ జగదీష్, కొమ్ముల కన్నబాబు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 07:19 AM