ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Train Accident: ఒడిశాలో నివశిస్తున్న ఏపీకి చెందిన వ్యక్తి మృతి..

ABN, First Publish Date - 2023-06-04T10:46:59+05:30

రాజమండ్రి: బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల గల్లంతుపై గందరగోళం నెలకొంది. కొందరిని అధికారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: బాలాసోర్ జిల్లా (Balasore District)లో జరిగిన రైలు ప్రమాదం (Train Accident)లో తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రయాణీకుల గల్లంతుపై గందరగోళం నెలకొంది. కొందరిని అధికారులు గుర్తించారు. కోరమండల్ హౌరా యశ్వంతపూర్ రైళ్లలో మరికొందరు తెలుగు ప్రయాణీకుల వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రమాదంలో గాయపడిన కొందరు తెలుగువాళ్లను గుర్తించి ఏపీకి పంపారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారు ఏమయ్యారన్న టెన్షన్ నెలకొంది. ప్రమాదంలో ఒడిశాలో నివశిస్తున్న ఏపీకి చెందిన వ్యక్తి గురుమూర్తి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 16 మంది గాయపడినట్లు గుర్తించారు.

విశాఖ, అరిలోవకు చెందిన ఇద్దరిని ఒడిశా నుంచి అంబులెన్స్‌లో ఏపీకి తరలించారు. పలాసకు చెందిన కొంతమందికి ఒడిశాలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఏపీకి చెందిన 16 మంది మాత్రమే గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒడిశా వెళ్లిన ఏపీ అధికారులు రాష్ట్రానికి చెందినవారు ఎవరైనా ఉంటే గుర్తించి ఏపీకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అటు రిజర్వేషన్ లేని ప్రయాణీకులపై అస్పష్టత కొనసాగుతోంది. తెలుగువాళ్లే 70 మందికి పైగా ఉండొచ్చని లక్కలు చెబుతున్నాయి. మరోవైపు జరల్ బోగిల్లో 50 మంది వరకు ఉండొచ్చని రైల్వేశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రాజమండ్రికి చెందిన ఆరుగురి ప్రయాణీకులు ఆచూకి ఇప్పటివరకు లభ్యం కాలేదు. రాజమండ్రికి చెందిన 31 మంది కోరమండల్ రైలుకు రిజర్వేషన్ చేయించుకున్నారు. ప్రమాదం నుంచి 25 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఆరుగురి ప్రయాణీకుల వివరాలు తెలియాల్సి ఉంది. హెల్ప్ డెస్క్ ద్వారా వారి వివరాలు తెలుసు కేనేందుకు రైల్వే అధికారుల ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-06-04T10:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising