ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

20 నుంచి సమ్మె

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:31 AM

సమగ్రశిక్షాభియాన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఈనెల 20 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు.

సమగ్రశిక్ష సిబ్బంది పెన్‌డౌన్‌తో నిరసనలు మొదలు

కె.గంగవరం, డిసెంబరు16: సమగ్రశిక్షాభియాన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఈనెల 20 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఆయా ఉద్యోగ సంఘాల సూచనలతో ఎంఈవో ఎ.నాగరాజు, ఏంఈవో2 చోడిశెట్టి ఆంజనేయులకు సమ్మె నోటీసులు అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు శనివారం వారు పెన్‌డౌన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్‌, క్రాట్రాక్టు సిబ్బంది వై. దుర్గారావు, ఏ. నాగలక్ష్మి, జె.ఎస్‌.ఎస్‌. సూర్యనారాయణలు పాల్గొన్నారు.

అల్లవరంలో పెన్‌డౌన్‌

అల్లవరం, డిసెంబరు16: అల్లవరం మండల విద్యాశాఖ కార్యాలయంలో సమగ్రశిక్ష సిబ్బందిగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగు లు పెన్‌డౌన్‌ ద్వారా నిరసన తెలిపారు. కనీస వేతనం అమలుచేయాలని, పనికి తగిన వేతనం చెల్లించాలని, వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలనే డిమాండ్లతో సిబ్బంది నిరసన తెలిపారు.

ఉప్పలగుప్తంలో ఎంఈవోకు వినతిపత్రం

ఉప్పలగుప్తం, డిసెంబరు 16: సమగ్రశిక్ష సిబ్బంది శనివారం కార్యాలయాల్లో ఏవిధమైన విధులు నిర్వర్తించకుండా నిరసన తెలిపారు. తక్షణమే జీతం బకాయిలు చెల్లించాలని, ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్లతో నిరసన తెలుపుతున్నామని ఎంఈవో సత్తి సత్యకృష్ణకు వివరించారు. ఆ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సీఆర్పీలు, కార్యాలయ సిబ్బంది, హైస్కూళ్లలోని ఇనస్ట్రక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising