AP News: ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి
ABN, Publish Date - Dec 30 , 2023 | 09:48 AM
నగర మేయర్ ఇంటి సమీపంలో ఆరేళ్ళ బాలుడి కార్తికేయపై వీధి కుక్కల దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలుడికి గాయాలవగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఉదయాన్నే కరాటే తరగతులకు వెళుతున్న కార్తికేయపై ఐదు కుక్కలు దాడి చేశాయి.
గుంటూరు: నగర మేయర్ ఇంటి సమీపంలో ఆరేళ్ళ బాలుడి కార్తికేయపై వీధి కుక్కల దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలుడికి గాయాలవగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఉదయాన్నే కరాటే తరగతులకు వెళుతున్న కార్తికేయపై ఐదు కుక్కలు దాడి చేశాయి. బైక్‌పై వచ్చిన వాహనదారుడు సకాలంలో స్పందించి బాబుని కుక్కల బారి నుంచి రక్షించాడు. సెలవులు కావటంతో కార్తికేయ చుట్టాలింటికి వచ్చాడు. బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
Updated Date - Dec 30 , 2023 | 09:48 AM