ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జిందాల్‌తో విశాఖ ఉక్కు పెద్దల మంతనాలు!

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:50 AM

డిసెంబరు 17: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్‌ఫర్నే్‌స-3ను నడిపేందుకు జిందాల్‌ స్టీల్‌తో ఎంఓయూ చేసుకోవాలని స్టీల్‌ప్లాంటు కమిటీ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్ణయించినట్టు తెలిసిందని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకుడు, సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌ ఆరోపించారు.

బ్లాస్ట్‌ఫర్నేస్‌-3ను కట్టబెట్టేందుకు కుట్ర?

సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరాం ఆరోపణ

నేడు ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా

ఉక్కుటౌన్‌షి్‌ప(విశాఖపట్నం), డిసెంబరు 17: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్‌ఫర్నే్‌స-3ను నడిపేందుకు జిందాల్‌ స్టీల్‌తో ఎంఓయూ చేసుకోవాలని స్టీల్‌ప్లాంటు కమిటీ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్ణయించినట్టు తెలిసిందని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకుడు, సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌ ఆరోపించారు. ఆదివారం విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంటుకు సహకారం అందించాల్సింది పోయి, నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్లాంటు అమ్మకం తాత్కాలికంగా ఆగిందంటూ ప్రచారం చేస్తూనే, ఇంత అత్యవసరంగా ఢిల్లీలో కూర్చుని ఉక్కు సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జిందాల్‌ రావడం లేదని, సెయిల్‌తో మాట్లాడుతున్నామని ఈ నెల రెండో తేదీన జరిగిన సమావేశంలో స్పష్టంగా చెప్పారని, ఇంతలోనే ఏం జరిగిందని అయోధ్యరామ్‌ ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో జరుగుతున్న రహస్య చర్చల సారాంశం ఏమిటో చెప్పాలన్నారు. జిందాల్‌తో జరుగుతున్న చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. బీఎ్‌ఫ-3ను నడిపేందుకు కేవలం రూ.1200 కోట్లు సరిపోతాయని సీఎండీ స్వయంగా చెప్పారని, చిత్తశుద్ధితో కృషిచేస్తే ఆ మొత్తం సమీకరించడం పెద్ద సమస్య కాదన్నారు. ఎన్‌ఎండీసీకి రూ.2 వేల కోట్లు అప్పు తీర్చారని, బ్యాంకులకు రుణాలు కడుతున్నారని, జీఎ్‌సటీ కడుతున్నారని, కానీ జీతాలు ఇచ్చేందుకు నగదు లేదని ఉద్యోగులను, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. కుట్రలను ఎదిరించేందుకు కార్మికవర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉక్కు పరిపాలన భవనం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపడతామని, కార్మికవర్గం భారీగా పాల్గొనాలని కోరారు.

సీఎండీ, డైరెక్టర్ల బంగ్లాలను ముట్టడిస్తాం..

బీఎ్‌ఫ-3ను జిందాల్‌కు కట్టబెట్టే కుట్రలో ఉక్కు సీఎండీ, డైరెక్టర్ల పాత్ర కీలకమని, వారి బంగ్లాలను ముట్టడిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు ప్రకటించారు. వారంతా ప్లాంటును నాశనం చేస్తున్నారని, వారిని టౌన్‌షిప్‌ దాటి కదలనివ్వబోమన్నారు. ప్లాం ట్‌ పరిరక్షణకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు.

Updated Date - Dec 18 , 2023 | 02:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising