ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దివ్యాంగుల పింఛన్‌ రూ.6000కు పెంచాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:43 PM

రాష్ట్రంలోని దివ్యాంగుల పింఛన్లు పెంచాలని డిజేబుల్డ్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిపీ మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు.

నంద్యాల టౌన్‌, డిసెంబరు 17 : రాష్ట్రంలోని దివ్యాంగుల పింఛన్లు పెంచాలని డిజేబుల్డ్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిపీ మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మస్తాన్‌వలి మాట్లాడారు. మూడు రోజుల కిందట జరిగిన ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పింఛన్‌ రూ.3 వేలకు పెంచారని, పెరుగుతున్న నిత్యావసర సరుకులు, విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌ ధరలను దృష్టిలో పెట్టుకొని వికలాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణాలో 4016 ఇప్పటికే ఇస్తున్నారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వికలాంగుల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచారని అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డిజేబుల్డ్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏపీ ఉపాధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌, సహాయ కార్యదర్శి ఎల్లయ్య, సభ్యులు జహీర్‌, ముస్తఫా, మనన్‌, సలహాదారులు నబీరసూల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising