ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DC posts in Devadayashakha : పోస్టుల భర్తీ ఇంకెప్పుడు?!

ABN, First Publish Date - 2023-11-10T03:49:24+05:30

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడు అన్న చందంగా మారింది దేవదాయ శాఖలో డీసీ(డిప్యూటీ కమిషనర్‌) పోస్టుల పరిస్థితి. ప్రభుత్వం కొత్తగా పోస్టులు మంజూరు చేసినా.. వాటి భర్తీకి ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంలేదు. ప్రస్తుతం

దేవదాయశాఖలో డీసీ పోస్టుల భర్తీపై మీనమేషాలు

27 ఏళ్లుగా నిలిచిన డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

మరోవైపు తీవ్రంగా ఆర్జేసీల కొరత

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడు అన్న చందంగా మారింది దేవదాయ శాఖలో డీసీ(డిప్యూటీ కమిషనర్‌) పోస్టుల పరిస్థితి. ప్రభుత్వం కొత్తగా పోస్టులు మంజూరు చేసినా.. వాటి భర్తీకి ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంలేదు. ప్రస్తుతం దేవదాయ శాఖలో 8 డిప్యూటీ కమిషనర్‌ పోస్టులున్నాయి. ఇందులో ఆరు పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. మరో రెండు పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ దేవదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చివరగా 1996 డీసీ పోస్టుల భర్తీని చేపట్టారు. ఇప్పటికి 27 ఏళ్లయినా ఇప్పటి వరకూ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ఇప్పుడు నియమితులైన ఇద్దరు అధికారులు రిటైర్‌మెంట్‌కు దగ్గకు వచ్చేశారు. కొత్తగా 18 డిప్యూటీ కమిషనర్‌ పోస్టులకు అనుమతి వచ్చింది. అంటే ఇప్పడు 8తో కలిపి 26 డీసీ పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. వీటిలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఎన్ని, పదోన్నతుల ద్వారా ఎన్ని భర్తీ చేస్తారన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్ణయించలేదు. నిబంధనల ప్రకారం అయితే 8 డీసీల్లో 2 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు ఇస్తే, 26 పోస్టుల్లో కనీసం 6 పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.

డీసీ పోస్టుల కొరత వల్ల రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను ఇన్‌చార్జి ఈవోలతో నింపుతున్నారు. ఈ సమస్య పరిష్కరం కావాలంటే వెంటనే కొత్తగా డీసీ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా డీసీ పోస్టులు, ఇతర పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. దేవదాయ శాఖలో కొన్నేళ్లుగా ఆర్జేసీల కొరత శాఖను వేధిస్తోంది. కానీ ఆ సమస్య పరిష్కారానికి ఏ ఒక్క కమిషనర్‌ ప్రయత్నం చేయడం లేదు. శాఖలో 11 ఆర్జేసీ పోస్టులున్నాయి. డీసీ పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేయడం, ఏసీలకు డీసీ పదోన్నతులు కల్పిస్తే, ఆ తర్వాత రెం డేళ్లకు వల్ల ఆర్జేసీగా పదోన్నతులు లభిస్తాయి. కానీ కొన్నేళ్లుగా ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ చేయడంలేదు. ప్రస్తుతం దేవదాయ శాఖలో భ్రమరాంబ, సత్యనారాయణమూర్తి, త్రినాథ్‌రావు, చంద్రశేఖర్‌ అజాద్‌లు మాత్రమే రెగ్యులర్‌ ఆర్జేసీలుగా ఉన్నారు. మిగిలిన ఆర్జేసీ పోస్టుల భర్తీకి మళ్లీ బయట శాఖల అధికారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అధికారులు డీసీ పోస్టుల భర్తీ, పదోన్నతులపై దృష్టిపెట్టాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-11-10T03:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising