ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

25న శ్రీవారి మార్చి నెల దర్శన కోటా విడుదల

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:11 AM

తిరుమల శ్రీవారి మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

తిరుమల శ్రీవారి మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే 18వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్‌ కోటాను నమోదు చేసుకోవచ్చు. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెటు విడుదల చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి టస్ర్టు దాతలకు దర్శనం, గదుల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు దర్శన టికెట్లను విడుదల చేస్తారు. 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. ఇక, 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవ, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ‘టీటీదేవస్థానమ్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Updated Date - Dec 17 , 2023 | 05:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising