ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:50 AM

అటు పోలవరం ప్రాజెక్టు, ఇటు రాజధాని అమరావతిపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు.

రాజధానిపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 16: అటు పోలవరం ప్రాజెక్టు, ఇటు రాజధాని అమరావతిపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ప్రాజెక్టును ఇక్కడి పాలకులు డబ్బులు తోడుకోవడానికి ఉపయోగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా పురందేశ్వరి శనివారం ఇక్కడ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘జాతీయ హోదా కల్పించిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే భరిస్తోంది. కానీ ప్రాజెక్టులో నీళ్లు తోడాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ డబ్బులు తోడుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాం. ప్రతి పైసా కేంద్రం ఇచ్చినప్పుడు ప్రాజెక్టు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ప్రశ్నించాలి’ అని ఆమె అన్నారు. అలాగే, ఏపీ రాజధాని అమరావతే అని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేసిందని, ఏపీ రాష్ట్ర రాజధానిపై తమ అంకిత భావం తెలిపేందుకు ఇంతకన్నా ఏం చేయాలని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని, వీటిలో రూ.500 కోట్లు గుంటూరు జిల్లాకు, రూ.500 కోట్లు విజయవాడకు మినహాయిస్తే రూ.1500 కోట్లు అమరావతి మౌలిక సదుపాయాలకు ఇచ్చిందని తెలిపారు.

ఇక, ఏపీలో నకిలీ ఓటర్లకు సంబందించి ఢిల్లీలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పురందేశ్వరి తెలిపారు. ఉదాహరణకు విశాఖ నార్త్‌ నియోజకరవ్గంలో 2.70లక్షల ఓట్లు ఉంటే, అందులో 22 శాతం అంటే 61వేల ఓట్లు భౌతికంగా ఆ నియోజవర్గంలో లేరని తెలిపారు. ఏపీలో విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ వర్గానికీ ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట.. ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారని, రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులు కేవలం అధికార పార్టీ నేతల జేబుల్లోకే చేరాలనే ధ్యాస తప్ప, ప్రజలు, రాష్ర్టాభివృద్ధి చేయాలనే ధ్యాసే పాలకులకు లేదన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని, కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావడంలేదని, ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ర్టాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టేందుకు ముందుకు రాని పరిస్ధితి ఏర్పడిందని, అదేంటని ప్రశ్నిస్తే వెంటనే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపించడం వంటి భయానక వాతావరణం కనపడుతోందన్నారు. నా ఎస్టీలు, ఎస్సీలు, నా బీసీలు అని చెబుతున్న సీఎం జగన్‌.. వారికి అందాల్సిన స్వయం సహాయక రుణాలు ఎందుకు అందించలేదో చెప్పాలని పురందేశ్వరి ప్రశ్నించారు.

Updated Date - Dec 17 , 2023 | 04:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising