ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెరుగుతున్నకరోనా కేసులు

ABN, Publish Date - Dec 26 , 2023 | 02:34 AM

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్టణంలో నాలుగు రోజులుగా కేసులు నమోదవుతుండగా..

విశాఖలో మరో రెండు నమోదు

మొత్తం 20కు చేరిన యాక్టివ్‌ కేసులు

సిక్కోలులో మూడు నమోదు

దేశంలో 64 జేఎన్‌.1 కేసులు

విశాఖపట్నం, శ్రీకాకుళం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్టణంలో నాలుగు రోజులుగా కేసులు నమోదవుతుండగా.. శ్రీకాకుళంలో కొత్తగా మూడు కేసులు వచ్చా యి. విశాఖపట్టణం జిల్లాలో సోమవారం వంద మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. ఆనందపురం మండలం పడుగుపాలెంలో ఒకటి, నగర పరిధిలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో గల ప్రగతినగర్‌లో మరొకటి వెలుగుచూశా యి. జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వీరి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించినట్టు జగదీశ్వరరావు తెలిపారు. వీటితో జిల్లాలో యాక్టివ్‌ కేసుల సం ఖ్య 20కు చేరింది. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారంతా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో మూడు కే సులు నమోదయ్యాయి. ఇందులో ఒకరిది మెళియాపుట్టి మండలం కాగా... మరో ఇద్దరు శ్రీకాకుళం నగరానికి చెందినవారు.

దేశంలో 64 జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్‌-వేరియంట్‌ ‘జేఎన్‌.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సోమవారం మరో 628 కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 4,504కు చేరింది.

Updated Date - Dec 26 , 2023 | 02:34 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising