ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలి : సీఐటీయూ

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:10 AM

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక శాఖలో ఒప్పంద ఇంజనీరింగ్‌ కార్మికులను క్రమ బద్ధీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానవేతనం, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ మున్సిపల్‌ కార్మిక సంఘం నంద్యాల శాఖ నాయకులు డిమాండ్‌ చేశారు.

నంద్యాల టౌన్‌, డిసెంబరు 22 : రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక శాఖలో ఒప్పంద ఇంజనీరింగ్‌ కార్మికులను క్రమ బద్ధీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానవేతనం, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ మున్సిపల్‌ కార్మిక సంఘం నంద్యాల శాఖ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పురపాలక ఒప్పంద కార్మికులతో సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌, కార్మికుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి భాస్కరాచారి తదితరులు మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చి మాట తప్పి ఆప్కాస్‌ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ఆప్కాస్‌ విధానం వద్దని, ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 26 నుంచి మున్సిపల్‌ కార్మికులందరూ నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారని హెచ్చరించారు.

Updated Date - Dec 23 , 2023 | 12:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising