ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం గారూ... మీపై సినిమా తీస్తే ఊరుకుంటారా?

ABN, Publish Date - Dec 24 , 2023 | 03:16 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... ఆయన కుటుంబ సభ్యులపై సినిమా తీస్తే ఊరుకుంటారా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘వ్యూహం’ సినిమాపై ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌

జగన్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ

అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... ఆయన కుటుంబ సభ్యులపై సినిమా తీస్తే ఊరుకుంటారా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘వ్యూహం’ సినిమాపై ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌కు అధికారాన్ని నిలబెట్టుకోవడమే తప్ప వేరే లక్ష్యాలేవీ లేవని తాను భావిస్తున్నానని తెలిపారు. ‘వ్యూహం’ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘‘ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘వ్యూహం’ సినిమా గురించి రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఏపీలోని ప్రతిపక్ష నాయకుడిని, ఆయన కుటుంబ సభ్యులను, ఆయన పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. ప్రతిపక్షాలను మానసికంగా కృంగదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? ఇదే మీ అభిమతమా?’’ అంటూ వర్ల ప్రశ్నించారు.

Updated Date - Dec 24 , 2023 | 03:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising