ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యశ్‌ను ఇబ్బందిపెడుతున్న సీఐడీ: వర్ల

ABN, Publish Date - Dec 26 , 2023 | 02:54 AM

ఎన్‌ఆర్‌ఐ యశస్వి (యశ్‌) పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని ఏపీ సీఐడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.

అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఆర్‌ఐ యశస్వి (యశ్‌) పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని ఏపీ సీఐడీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ‘ఈ నెల 26న యశ్‌ వీసా రెన్యువల్‌ చేయాల్సి ఉండటంతో పలు దఫాలు ప్రాధేయపడినా సీఐడీ అధికారులు పట్టించుకోలేదు. సీఐడీ చీఫ్‌ సంజయ్‌కు నేను ఫోన్‌ చేసినా స్పందించలేదు. సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్‌ ముందు సానుకూలంగా స్పందించి ఇప్పుడు కోర్టులో పిటిషన్‌ వేసుకోవాలని చెప్తున్నారు. దీంతో యశ్‌కు సీఐడీ అధికారులు తీరని అన్యాయం చేశారు. ఏపీలో సీఐడీ రోజురోజుకూ దిగజారిపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి సీఐడీ అభాసుపాలయింది. కొందరు పోలీసులు జగన్‌ కాళ్ల దగ్గర సీఐడీని మోకరిల్లేట్లు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు’ అని వర్ల సీఐడీ చీఫ్‌ను హెచ్చరించారు.

Updated Date - Dec 26 , 2023 | 02:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising