ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

ABN, First Publish Date - 2023-11-24T01:45:58+05:30

వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డ పీలేరువాసి తన కుమార్తెకు అక్కడి అబ్బాయి నచ్చడంతో హిందూ సంప్రదాయం ప్రకారం తిరుపతిలో పెళ్లి చేశారు.

పీలేరు ఎన్‌ఆర్‌ఐకి అమెరికా అబ్బాయితో పెళ్లి

తిరుపతి(కొర్లగుంట), నవంబరు 23: వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డ పీలేరువాసి తన కుమార్తెకు అక్కడి అబ్బాయి నచ్చడంతో హిందూ సంప్రదాయం ప్రకారం తిరుపతిలో పెళ్లి చేశారు.అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన జె.విద్యాసాగర్‌ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం 1990లో అమెరికా వెళ్లారు.తిరుపతికి చెందిన పి.విజయలక్ష్మిని మనువాడి అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమార్తె రోషినివైష్ణవి అక్కడే విద్యనభ్యసించి సైబర్‌ సెక్యూరిటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన అమెరికా అబ్బాయి కొడిజేమ్స్‌లాయిడ్‌ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవడంతో ప్రేమ చిగురించింది. ఇరువైపులా పెద్దలు వివాహానికి అంగీకరించారు.తిరుపతిలో గురువారం రాత్రి డీబీఆర్‌ రోడ్డులోని శ్రీకన్వెన్షన్‌ హాల్లో రిసెప్షన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.శుక్రవారం ఉదయం హిందూ సంప్రదాయంలో వివాహం జరగనుంది.వరుడి మత సంప్రదాయం ప్రకారం అమెరికాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరోసారి వీరి వివాహం జరగనుంది.

Updated Date - 2023-11-24T01:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising