టీచర్లకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోండి
ABN, First Publish Date - 2023-12-03T02:39:39+05:30
ముఖ హాజరు వేయలేదని కారణం చూపుతూ టీచర్లకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని ఫ్యాప్టో నాయకులు శనివారం డీఈవో విజయేంద్రరావుకు వినతి పత్రం ఇచ్చారు.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 2: ముఖ హాజరు వేయలేదని కారణం చూపుతూ టీచర్లకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని ఫ్యాప్టో నాయకులు శనివారం డీఈవో విజయేంద్రరావుకు వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో 8 వేల మంది టీచర్లు పనిచేస్తుండగా, సకాలంలో పాఠశాలకు వెళ్లి ముఖ హాజరు వేయ్యలేదని 96 మందికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ముఖ హాజరు వేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని డీఈవో దృష్టికి తెచ్చారు. సిగ్నల్ లేకపోవడం, సర్వర్లు పనిచేయకపోవడం వంటి సాంకేతిక ఇబ్బందుల వల్లే ముఖ హాజరు నమోదు కాలేదన్నారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునాఫ్, రమణ, నేతలు దేవరాజులు, గోపినాథ్, దేవరాజులు, కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-12-03T02:39:41+05:30 IST