ద్విచక్ర వాహనం బోల్తా - యువకుడి మృతి
ABN, First Publish Date - 2023-11-06T00:59:28+05:30
ద్విచక్ర వాహనం బోల్తాపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది.
యాదమరి, నవంబరు 5: ద్విచక్ర వాహనం బోల్తాపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె పంచాయతీ ఆండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అమరావతి, పరమశివ కుమారుడు రెడ్డి మోనీష్ (18) అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని ఫింగర్‌ప్రింట్ వేయడానికి తన స్నేహితుడి ద్విచక్ర వాహనం తీసుకుని ఫ్యాక్టరీ ఆవరణలో వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో అతడి తలకు తీవ్రగాయమైంది. స్థానికులు హుటాహుటిన రెడ్డిమోని్‌షను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించడంతో చీలాపల్లి సీఎంసీకి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.
Updated Date - 2023-11-06T00:59:29+05:30 IST