ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు

ABN, First Publish Date - 2023-05-30T13:33:06+05:30

తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. ఘాట్ రోడ్డు డ్రైవింగ్‌పై వాహనదారులకు అవగాహన లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.. వాహనాల అతి వేగం వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ముని రామయ్య మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డు డ్రైవింగ్‌పై వాహనదారులకు అవగాహన లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.. వాహనాల అతి వేగం వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని ఏఎస్పీ ముని రామయ్య సూచించారు. డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు.. సలహాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఘాట్ రోడ్డు లో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఘాట్ రోడ్డులో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే.. ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ ముని రామయ్య పేర్కొన్నారు.

Updated Date - 2023-05-30T14:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising