ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కట్టేసి కొట్టించారు!

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:35 AM

సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు ఓ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టేదాకా వెళ్లింది.

Rakesh Reddy expressing anger

డీసీసీబీ చైర్మన్‌పై చిల్లకూరు కార్యకర్త ఆగ్రహం

ిసెంబర్‌ 16: సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు ఓ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టేదాకా వెళ్లింది. రెండు రోజుల క్రితం దొరవారిసత్రం మండలంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అసమ్మతి వర్గం నిర్వహించిన సమావేశంలో పెళ్లకూరు మండలం చిల్లకూరుకు చెందిన దువ్వూరు రాకే్‌షరెడ్డి మాట్లాడారు.ఎమెల్యే సంజీవయ్యపై, డీసీసీబీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రాకే్‌షరెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్న మినరల్‌ వాటర్‌ ప్లాంటుకు సత్యనారాయణరెడ్డి అనుచరులు శనివారం సాయంత్రం తాళాలు వేసేందుకు ప్రయత్నించారు.అడ్డుకోబోయిన రాకే్‌షరెడ్డి తండ్రి విజయులురెడ్డిపై దాడి చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రాకే్‌షరెడ్డిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దాడి చేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఇరువర్గాలనూ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.ఈ విషయమై ఎస్‌ఐ శ్రీకాంత్‌ను వివరణ కోరగా కేసులేవీ నమోదు చేయలేదని తెలిపారు.శనివారం రాత్రి నాయుడుపేటకు చేరిన రాకే్‌షరెడ్డి సత్యనారాయణరెడ్డి వ్యతిరేక వర్గాన్ని కలిశారు. వైసీపీ ఆవిర్భావం నుంచీ చిత్తశుద్ధితో పనిచేస్తున్న తనను సత్యనారాయణరెడ్డి అనుచరులు స్తంభానికి కట్టేసి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.అడ్డొచ్చిన తన తండ్రి విజయులురెడ్డిని కూడా కొట్టారని తెలిపారు.దీంతో సత్యనారాయణరెడ్డి వ్యతిరేక వర్గం రాకేష్‌ రెడ్డికి మద్దతుగా నాయుడుపేటలో ధర్నాకు సమాయత్తమైంది.ఈ సమాచారం అందుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఆ వర్గంతో మాట్లాడి ధర్నాను విరమింపజేసినట్లు సమాచారం.వారం రోజుల్లో సమగ్రంగా విచారించి తగు చర్యలు చేపడతామని సర్ది చెప్పినట్లు తెలిసింది.

Updated Date - Dec 17 , 2023 | 01:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising