ఈ నెలా కందిపప్పు లేదు
ABN, First Publish Date - 2023-10-30T01:26:26+05:30
రేషన్ షాపుల్లో ఆరు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. నిన్నటి దసరాకు, రేపటి దీపావళికి కార్డుదారులకు కందిపప్పు లభించే అవకాశం లేదు.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 29: రేషన్ షాపుల్లో ఆరు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. నిన్నటి దసరాకు, రేపటి దీపావళికి కార్డుదారులకు కందిపప్పు లభించే అవకాశం లేదు. జిల్లాలో 5,41,703 కార్డుదారులు ఉన్నారు. జూన్ నెలలో ఐదు శాతం మాత్రమే కందిపప్పు పంపిణీ జరిగింది. ఆ తర్వాత నెలలో గింజపప్పు కూడా పంపిణీ కాలేదు. నవంబరు నెలకు బియ్యం, రాగులు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబరులో మున్సిపాలిటీల్లో మాత్రం వంద టన్నుల గోధుమ పిండిని నగదుకు పంపిణీ చేశారు, నవంబరులో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్డుదారులకు కిలో గోధుమ పిండిని రూ.16 చొప్పున పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు నగదుకు అర కిలో చక్కెర ఇవ్వనున్నారు.
Updated Date - 2023-10-30T01:26:26+05:30 IST