ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బరితెగించిన భూబకాసురులు

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:43 PM

శ్రీకాళహస్తిలో భూబకాసురుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది.నిత్యం వివాదాలు వెంటాడుతున్నా... జనం దుమ్మెత్తి పోస్తున్నా... బాధితులు కడుపు మంటతో తరిమికొడుతున్నా... పట్టింపు లేదన్నట్టుగా కొందరు అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు.మళ్లీ కొత్త బైపాస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న బసవయ్యపాలెం చెరువుపై కన్నేశారు. మూడు నెలల క్రితం ఇక్కడ రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బాటలు వేశారు. దీనిపై సెప్టెంబర్‌ 27వ తేదిన భూరాబందులు శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది.తేలు కుట్టిన దొంగల్లా మౌనముద్ర దాల్చిన అక్రమార్కులు అందరూ మరిచిపోయి వుంటారన్న ధీమాతో మళ్లీ సోమవారం రాత్రి బసవయ్యపాలెం చెరువులో రూ.కోట్ల విలువైన భూమిని యంత్రాలతో చదును చేశారు.

చెరువు సరిహద్దు ట్రెంచ్‌ను మార్చేశారిలా.....

శ్రీకాళహస్తి, డిసెంబరు 26:శ్రీకాళహస్తి పట్టణ శివారు బసవయ్యపాలెం నుంచి తొట్టంబేడు వరకూ 20 ఏళ్ల క్రితం 100అడుగుల లింక్‌ బైపాస్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. చెన్నై, నాయుడుపేట రహదారులను అనుసంధానం చేస్తూ ఈ బైపాస్‌ రోడ్డును నిర్మించారు. బసవయ్య పాలెం, పద్మాలయ చెరువుల మీదుగా ఈ రోడ్డు ఏర్పడింది. దీంతో అక్కడి భూములకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. పెద్దఎత్తున వెంచర్లు వెలిసాయి. పట్టణానికి ఆనుకుని ఉండడంతో ప్రభుత్వాసుపత్రి నుంచి బైపాస్‌ వరకు శరవేగంగా ఇళ్లు విస్తరించాయి. బైపాస్‌కి ఆనుకొని ఉన్న చెరువుల భూములను గత ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి కబ్జా కోరల నుంచి కాపాడుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి భవిష్యత్తు ప్రజావసరాల దృష్ట్యా ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించి రక్షించారు. బైపాస్‌ రోడ్డుతో పాటు పట్టణం విస్తరించడంతో బైపాస్‌కు ఆనుకొని ఎకరం భూమి ప్రస్తుతం రూ.16 కోట్ల వరకూ పలుకుతోంది.దీంతో కొందరు అధికార పార్టీ నేతలు ముందుగా సెటిల్మెంటుకు ఆనుకుని ఉన్న కొంత భూమిలో పాగా వేసేందుకు, తర్వాత క్రమంగా చెరువును చిదిమేసేందుకు పథకం వేశారు. సెప్టెంబర్‌ 27వ తేదీన ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.రెవెన్యూ అధికారులను బసవయ్యపాలెంలో చెరువు కబ్జాను అరికట్టాలంటూ కలెక్టర్‌ సీరియస్‌గా ఆదేశించారు. అయితే రెవెన్యూ అధికారులు కంటిచూపుగా నాటకీయ స్పందనకు తెర తీశారు. బసవయ్యపాలెం చెరువు భూమికి ట్రెంచ్‌ కొట్టిస్తున్నామని చెప్పుకున్నారు. అయితే స్కేలు పెట్టి గీత గీసినట్లుగా చక్కగా కొంత దూరం ట్రెంచ్‌ కొట్టారు. ఎక్కడైనా ఇలా ఖచ్చితంగా చెరువు భూమి ఉంటుందా అని ప్రజలు ప్రశ్నించినా పట్టించుకోలేదు. ఆ రోజు రెవెన్యూ అధికారులు చెరువు సరిహద్దుగా తీసిన ట్రెంచ్‌ అంతంత మాత్రమే. అప్పటి నుంచి అదును కోసం ఎదురుచూస్తున్న అక్రమార్కులు సోమవారం రాత్రి సొంత యంత్రంతో రంగంలోకి దిగారు. తూతూ మంత్రంగా రెవెన్యూ అధికారులు వేసిన చెరువు హద్దును చిదిమేశారు. వారికి ఇష్టమైనట్టుగా యంత్రంతో కొత్త ట్రెంచ్‌ను రాత్రికి రాత్రి లోడేశారు.ఈ విషయాన్ని స్థానికులు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు బసవయ్యపాలెం చెరువు కబ్జాపై ఫిర్యాదు చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 11:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising