న్యాయశాఖ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:19 PM
న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ రెడ్డి కోరారు.
చిత్తూరు లీగల్, డిసెంబరు 17: న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ రెడ్డి కోరారు. చిత్తూరులోని న్యాయవాదుల సంఘం భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కువ కేసులున్న కోర్టులలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. క్రిమినల్, సివిల్ కేసులను నిర్వహించే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలో చార్జిషీట్లను నిర్వహించడానికి అదనపు సూపరింటెండెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్‌ను కేటాయించాలన్నారు. అర్హులైన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులను వారి స్వస్థలాలకు లేదా వారుకోరుకున్న స్థానాలకు బదిలీ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమస్యలను రెండ్రోజుల్లో జిల్లా జడ్జి ఈ.భీమరావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు లక్ష్మీపతి, గిరిధర్ రెడ్డి, బాలసుందర్, రాజేష్, దామోదరం, గణే్‌షకుమార్, ప్రభాకర్ రెడ్డి, హరికృష్ణ, పవన్‌కుమార్, డి.దామోదరంతో పాటు పలువురు నాయకులు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:19 PM