ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్‌ఐ పోస్టులకు అన్నాచెల్లెళ్ల ఎంపిక

ABN, Publish Date - Dec 23 , 2023 | 01:42 AM

ఒకే కుటుంబంలో ఇద్దరు ఒకేసారి ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు.

అమ్మ గీతాసుధతో తేజ , హారిక

ఎర్రావారిపాలెం ,డిసెంబరు 22 ; ఒకే కుటుంబంలో ఇద్దరు ఒకేసారి ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు. ఎర్రావారిపాలెం మండలం పచ్చార్లవాండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పోకల చెన్నకేశవులు, గీతా సుధ దంపతులు.వీరిలో చెన్నకేశవులు ఏడాది క్రితం మరణించారు. పోకల గీతా సుధ ప్రస్తుతం భాకరాపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయరాయులిగా పనిచేస్తోంది. వీరి కుమారుడు తేజ , కుమార్తె హారిక ఒకేసారి ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు. ఇంతకుముందే ‘కాగ్‌ ’ బెంగళూరు శాఖలో ఆడిటింగ్‌ అధికారి, సెంట్రల్‌ జీఎస్టీ డిపార్టుమెంటులో విశాఖ రీజియన్‌లో ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు ఎంపికైన తేజ ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంగాధర నెలూరు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కార్యదర్శి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేశాడు.ప్రస్తుతం మూడు పోస్టుల్లో ఏదో ఒకటి ఎంచుకునే పనిలో వున్నాడు.శుక్రవారం వారిద్దరినీ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఇంటివద్ద కలిసి అభినందించారు.

Updated Date - Dec 23 , 2023 | 01:42 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising