ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేణిగుంటకు ఎస్‌ఐలు కావలెను..!

ABN, First Publish Date - 2023-12-11T00:21:40+05:30

రేణిగుంట అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో కొంతకాలంగా రెండు ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రేణిగుంట, డిసెంబరు 10: రేణిగుంట అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో కొంతకాలంగా రెండు ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రేణిగుంట టౌన్‌లో శాంతి భద్రతలు, చోరీలు, ట్రాఫిక్‌ సమస్యల పట్ల పర్యవేక్షణ కొరవడింది. రేణిగుంట అర్బన్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌ఐలలో ఒకరు గత ఏడాది జూన్‌లో బదిలీపై వెళ్లారు. మరో ఎస్‌ఐ ఈ ఏడాది సెప్టెంబరులో బదిలీపై వెళ్లారు. ఈ సమాచారం జిల్లా స్థాయి అధికారులకు తెలిపినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడం శోచనీయం. ఇదిలా ఉండగా ఇటీవలే ఎస్పీ రేణిగుంట అర్బన్‌ పోలీసు స్టేషన్‌ను, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి వెళ్లారు. అయినప్పటికీ ఎస్‌ఐ పోస్టులు నియామకంపై దృష్టిసారించలేదు. రేణిగుంట అర్బన్‌పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇటీవల వరుస చోరీలు జరిగాయి. టౌన్‌పరిధిలో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. శాంతి భద్రతలు పరిరక్షించడానికి సిబ్బంది ఉన్నా పర్యవేక్షక సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు ఎస్‌ఐల నియామకం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-12-11T00:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising