ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిండ్రలో వర్షబీభత్సం

ABN, First Publish Date - 2023-12-06T00:57:31+05:30

తుఫాను నేపథ్యంలో నిండ్ర మండలంలో వర్షబీభత్సం చోటుచేసుకుంది.

కొప్పేడు వద్ద దెబ్బతిన్న కాజ్‌వే

నిండ్ర, డిసెంబరు 5: తుఫాను నేపథ్యంలో నిండ్ర మండలంలో వర్షబీభత్సం చోటుచేసుకుంది. చవరంబాకం, మిట్టూరు, జీఎన్‌ కండ్రిగ చెరువు కలుజులు పారడంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీహరికోట-బెంగళూరు హైవే ఏర్పాటులో భాగంగా అత్తూరు దళితవాడ వద్ద నీరు వెళ్ళడానికి మార్గం లేక పంట పొలాల్లో నిలిచిపోయింది. అందువలన సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. కొప్పేడు వద్ద నీటి ఉధ్రుతితో అరణియార్‌ కాజ్‌వే దెబ్బతింది. ఇక్కడా నీటి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు పంట పొలాలు నీట మునిగాయి. మంగళవారం ఉదయం నగరి ఆర్డీవో సృజన, తహసీల్దార్‌ భగవతి, ఎంపీడీవో అరుణ, ఎస్‌ఐ శివశంకర్‌, డీటీ నాగరాజు పర్యటించి ఓరూరుపేట ఎస్టీ కాలనీలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగు రోజుల వర్షాలకు సుమారు 46 పూరిగుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తహసీల్దారు తెలిపారు.

Updated Date - 2023-12-06T00:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising